మత్తెక్కించే ఆ సీన్ కోసేశారుగా..

Update: 2017-05-06 09:43 GMT
ఓవైపు ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రభంజనం కొనసాగుతుండగానే థియేటర్లలోకి దిగిపోయింది ‘బాబు బాగా బిజీ’. బాహుబలి-2 ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న నేపథ్యంలో ఈ చిన్న సినిమాను జనాలు పట్టించుకుంటారా అని జనాలు సందేహించారు. కానీ అడల్ట్ కామెడీ జానర్ కావడం వల్ల.. ఈ సినిమా ప్రోమోలు కుర్రాళ్లకు కిక్కివ్వడం వల్ల ఓపెనింగ్స్ అనుకున్న దాని కంటే మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రోజు థియేటర్లలో జనాలు బాగానే కనిపించారు. వారం తిరగ్గానే కొత్త సినిమా కోసం ఎదురు చూసే రెగ్యులర్  ఫిలిం బఫ్స్ తో పాటుగా.. సినిమాలో మత్తెక్కించే సన్నివేశాలుంటాయని  ఉత్సుకతతో వచ్చిన కుర్రాళ్ల వల్లే ‘బాబు బాగా బిజీ’కి ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి.

ఐతే సినిమాలో ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సన్నివేశం కుర్రాళ్లను నిరాశకు గురి చేసింది. ఈ సినిమా విడుదలకు ముందే ఇందులోని ఒక హాట్ సీన్ లీకైంది. అవసరాల.. ఒక ఆంటీతో రొమాన్స్ చేసే సీన్ అది. అందులో ఆంటీ బ్రా విప్పడం.. లిప్ లాక్.. ఘాటు రొమాన్స్.. ఇలా ఈ సన్నివేశం కొంచెం హద్దులు దాటే ఉంటుంది. సినిమాలో ఈ సన్నివేశం మరింత లెంగ్త్ తో ఉంటుందని కుర్రాళ్లు ఆశించారు. కానీ వాళ్లు ఆశించినట్లు అక్కడేమీ లేదు. విడుదలకు ముందు లీకైన సీన్.. సెన్సార్ వేటుకు గురైందని ఇప్పుడర్థమవుతోంది. డోస్ తగ్గించేయడంతో ఒరిజనల్ సీన్ రొమాన్స్ ప్రియుల్ని అసంతృప్తికి గురి చేస్తోంది. హిందీలో ఈ సీన్ ఓ రేంజిలో పండింది. ఎరోటిక్ సినిమాలకు తీసిపోని రీతిలో హైలైట్ అయింది. కానీ తెలుగులోకి వచ్చేసరికి చప్పగా సాగింది. ఈ సన్నివేశం అనే కాదు.. మొత్తంగా ఈ సినిమాలో రొమాన్స్ ఓ రేంజిలో ఉంటుందని ఆశించిన వాళ్లకు నిరాశ తప్పట్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News