కెరీర్లో ఇప్పటిదాకా తక్కువ బడ్జెట్ సినిమాలే తీశాడు డైరెక్టర్ మారుతి. రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ‘భలే భలే మగాడివోయ్’ సైతం రూ.10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే. దీంతో పాటు ఏ సినిమాకూ ఇండియా దాటి వెళ్లలేదు మారుతి. ఆ మాటకొస్తే అసలతను తెలుగు రాష్ట్రాల్ని దాటి వెళ్లింది కూడా లేదు. సన్నివేశాలతో పాటు పాటలన్నీ కూడా లోకల్ లొకేషన్లలోనే తీసేశాడు. ఐతే తొలిసారి మారుతి సినిమా తన సినిమా బడ్జెట్ ను రూ.10 కోట్లు దాటించడమే కాదు.. పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు సైతం వెళ్తున్నాడు. తన కొత్త సినిమా ‘బాబు బంగారం’ టాకీ పార్ట్ పూర్తి చేసిన మారుతి.. ఇక పాటల పనిలో పడుతున్నాడు.
ఈ సినిమాలో రెండు పాటల్ని స్పెయిన్ లో షూట్ చేయబోతున్నారట. ఇన్నాళ్లూ చిన్న-మీడియం రేంజి హీరోలతోనే పని చేశాడు మారుతి. కాబట్టి ఫారిన్ పాటల లగ్జరీ కోసం ప్రయత్నించలేదు. ఐతే ఈసారి విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా కాబట్టి తనకు తాను పెట్టుకున్న లిమిట్స్ దాటేస్తున్నాడు. వెంకీ-నయన్ మీద ఈ పాటలు తీయబోతున్నారు. ఈ నెలాఖరుకల్లా పాటలతో సహా ‘బాబు బంగారం’ షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందట. వచ్చే నెలలోనే ఆడియో రిలీజ్ చేసి.. నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సంగీతాన్నందిస్తుండటం విశేషం.