మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు వార్ గురించి తెలిసినదే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్లో బాబు మోహన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవికి పోటీపడుతున్నారు. ప్యానెల్ ప్రకటన అనంతరం బాబూ మోహన్ సూటిగా ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చేవాళ్లు .. ఆర్టిస్టుల్లో గ్రూపు రాజకీయాలు చేసే వాళ్లు విడగొట్టే వాళ్లు కళామతల్లి ముద్దు బిడ్డ కానే కాదని బాబూ మోహన్ విమర్శించారు. కళాకారులను విడగొట్టేందుకే ప్రకాష్ రాజ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఆర్టిస్టుల్లో కలతలు సెట్ అవుతున్నాయనుకుంటే ఈ ఇండస్ట్రీతో సంబంధం లేనివాళ్లు వచ్చి మాట్లాడుతుండటం బాధాకరం. నీలాంటి వాళ్లని ఎంతో మందిని పుట్టిస్తుంది ఈ ఇండస్ట్రీ. కళామ్మతల్లికి సేవ చేయాలనుకుంటే చేయాలి కానీ.. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదంటూ ప్రకాష్ రాజ్ పై పంచ్ లు వేసారు. 150 మంది లోకల్ కాదని అంటున్నాడు.. వీళ్లు ముందుకురారు.. వీళ్లు ఓట్లు వేయరు.. వీళ్లు పనికి వస్తాడు.. వీళ్లు పనికి రారు అని ఏదోదో మాట్లాడుతున్నాడు. అసలు సినిమా ఇండస్ట్రీలో పనికి రాని వాడు ఉంటాడా? విడదీసి మాట్లాడటం నాకు బాధకలిగింది అని బాబు మోహన్ అన్నారు. మద్రాసు నుంచి వచ్చాక ఇక్కడ అంతా బాగా కలిసిపోయారు. అనేక గొడవల నుంచి బయటపడ్డారని బాబూ మోహన్ అన్నారు.
``ఆ ప్యానల్ లో ఒకరు ఉన్నారు.. వాళ్ల సొంత ఊరిలో పోటీ చేస్తే నాలుగే ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీ చేస్తే నువ్ మావాడికి కాదు పో అన్నారు`` అంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి అండగా ఉన్న పెద్దన్నను పేరు పెట్టకుండానే దునుమాడారు. ఏడాదిగా ఎలాంటి పాలిటిక్స్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఆయనేదో (ప్రకాష్ రాజ్) స్టడీ చేశాడట.. హీరోలంతా ఫ్రీగా చేస్తానన్నారట.. సినిమాలు తీసి డబ్బులు తెచ్చి ఏదో చేస్తాడట.. వార్నీ!! ఎందుకండీ.. ఏమీ లేకుండా కూడా చేయొచ్చు.. మీ బుర్రని మంచి పనులకు వాడండి.. అని సూచించారు. విష్ణు ప్యానెల్ ని ఆశీర్వదించాలని కూడా బాబూ మోహన్ చివరిగా కోరారు. మొత్తానికి బాబూ మోహన్ పంచ్ లు ఇప్పుడు ప్రత్యర్థుల్లో చర్చకు వచ్చాయి.