సీనియర్ కమెడియన్ బాబూ మోహన్ వెండితెరపై తనదైన హాస్యంతో ఆకట్టుకున్న టాప్ కమెడియన్ లలో ఒకరాయన. నటుడు కోట శ్రీనివాసరావుతో ఆయనది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో అత్యధిక శాతం సూపర్ హిట్ లు బ్లాక్ బస్టర్ లున్నాయి. అంతలా వీరిద్దరి కాంబి నేషన్ తెలుగు ప్రేక్షకుల్ని కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది. టాలీవుడ్ లో కమెడియన్ లు ఎంత మంది వున్నా బాబు మోహన్ శైలి ప్రత్యేకం.
వందల చిత్రాల్లో నటించి హాస్య నటుడిగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారాయన. కెరీర్ తొలి నాళ్లలో విలన్ ఛాయలున్న పాత్రల్లో నటించి సీరియస్ కామెడీతో ఆకట్టుకున్న ఆయన ఆ తరువాత కమెడియన్ గానూ హీరోగానూ నటించి ఆకట్టుకున్నారు.
తనకున్న క్రేజ్ తో రాజకీయాల్లోనూ ప్రవేశించిన బాబూ మోహన్ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు, సీరియల్స్ కి మాత్రమే పరిమితమయ్యారు. నటుడిగా ఎంతో మందిని మనసారా నవ్వించిన ఆయన జీవితంలో చెరిగిపోని విషాదం వుంది.
అదే ఆయన తనయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం. ఒక్కగానొక్క కొడుకుని ప్రమాదంలో పోగోట్టుకున్న బాబుమోహన్ బాధ ఓ అరణ్య రోదన. ఇదే విషయాన్ని తాజాగా ఓ టీవీ లో వెల్లడించారు బాబు మోహన్.
తన కుమారుడి మరణం తరువాత తను పడిన బాధని ఈ సందర్భంగా తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. నా కుమారుడి మరణాన్ని నేను చాలా రోజులు జీర్ణించుకోలేకపోయానని, ఆ సమయంలో నన్ను నేనే మర్చిపోయానని తెలిపారు.
ఒకానొక దశలో తింటున్నానో.. ఎలా వున్నానో కూడా తనకు తెలియలేదని, ఒక జీవం లేని అస్థిపంజరంలా అయిపోయానని తెలిపారు. ఆ బాధని భరించలేక అర్థ్రరాత్రలు ఏడ్చానని, చనిపోవాలని అనుకున్నానని కన్నీళ్ల పర్యంతం అవుతూ షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. బాబుమోహన్ కు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బాబు మోహన్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నారు. ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్నారు.