ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌న‌టుడి భార్య ఫ్రెగ్నెన్సీ ఫేక్

ప్ర‌ముఖ గాయ‌ని, న‌టి శిబానీ దండేక‌ర్.. బాలీవుడ్ న‌టుడు, అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత ఫ‌ర్మాన్ అక్త‌ర్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-11 10:30 GMT

ప్ర‌ముఖ గాయ‌ని, న‌టి శిబానీ దండేక‌ర్.. బాలీవుడ్ న‌టుడు, అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత ఫ‌ర్మాన్ అక్త‌ర్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. 2022లో ఈ జంటకు పెళ్ల‌యింది. ఇటీవ‌ల‌ శిబానీ దండేకర్ గర్భవతి అనే వార్తలు సోషల్ మీడియాల‌లో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆస‌క్తి నెలకొంది.

అయితే ఈ వార్త‌ల్లో నిజం ఎంత‌? అనేదానిపై ఫర్హాన్ సవతి తల్లి, ప్రముఖ నటి షబానా అజ్మీ క్లారిటీనిచ్చారు. శిబానీ గర్భం దాల్చలేదని ష‌బానా ధృవీకరించారు. నిజానికి ఫర్హాన్ పుట్టినరోజున ఫోటోగ్రాఫ‌ర్లు కొన్ని ఫోటోల‌ను షేర్ చేసారు. వాటిలో శిబానీ పొత్తి క‌డుపు హైలైట్ అవ్వ‌డంతో గర్భవతి అని వార్తలు వెలువ‌డ్డాయి. తర్వాత శిబానీ గర్భం దాల్చిందనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

అయితే ఉన్న‌దున్న‌ట్టు ముక్కుసూటిగా మాట్లాడే న‌టిగా పేరున్న‌ షబానా అజ్మీ ఈ పుకార్లను ఖండించారు. షబానా ఈ ఊహాగానాలపై తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. శిబానీ గర్భవతి కాదని, ఇవ‌న్నీ నిరాధార వార్త‌లు అని అభిమానులకు స్ప‌ష్ఠ‌త‌నిచ్చారు.

2000లో అధునా బ‌బానీని పెళ్లాడిన ఫ‌ర్హాన్ ఆమెకు 2017లో విడాకులిచ్చాడు. ఆ త‌ర్వాత గాయ‌ని కం న‌టి శిబానీతో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఈ జంట కొన్నేళ్ల డేటింగ్ అనంత‌రం ప్రేమ వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతానికి శిబానీ ఫ్రెగ్నెన్సీ వార్త‌లు ఫేక్ అని తేలింది.

Tags:    

Similar News