హిట్టు కోసం అమ్మడు ఈగర్లీ వెయిటింగ్..!
ఒక చిన్న టీజర్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.
ఒక చిన్న టీజర్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆధార్ లవ్ లో కన్నుగీటి కుర్రాళ్ల గుండెల్లో స్థానాన్ని సంపాదించిన అమ్మడు ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందని అనుకున్నారు కానీ అమ్మడి విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. ఒరు ఆధార్ లవ్ టైం లో తెలుగులో ఆఫర్ ఇస్తామంటే నేను స్టార్స్ తోనే చేస్తానని కాస్త డాబు పోయిన అమ్మడు స్టార్ ఛాన్సులు అడిగితే రావు టాలెంట్ చూపిస్తే వస్తాయన్న విషయాన్ని గుర్తించలేదు.
ఇక మరీ లేట్ అవుతుంది ఏదొచ్చినా చేసేద్దాం అనుకున్న టైం లో తేజా సజ్జాతో ఒక సినిమా నితిన్ తో సినిమాలు పడ్డాయి. అప్పటికి అమ్మడిని అందరు లైట్ తీసుకున్నారు. సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో కెరీర్ రిస్క్ లో పడింది. సరైన కెరీర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ప్రియా ప్రకాష్ ఇలా వెనకపడాల్సి వచ్చింది.
ఐతే సినిమాలు హిట్ అవ్వలేదనే కానీ అమ్మడి చేతిలో సినిమాలు మాత్రం ఉంటున్నాయి. కోలీవుడ్ లో ధనుష్ డైరెక్షన్ సినిమాలో ఛాన్స్ అందుకున్న ప్రియా ప్రకాష్ కన్నడలో ఒకటి హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. ఉండటానికి 4 సినిమాలు లైన్ లో ఉన్నా ఏ ఒక్కటి కూడా ప్రియా ప్రకాష్ కు బజ్ క్రియేట్ చేయట్లేదు. అందుకే అమ్మడు రకరకాల ఫోటో షూట్స్ తో మెప్పించాలని చూస్తుంది.
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో షూట్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. అమ్మడు గ్లామర్ షో విషయంలో ఎలాంటి మొహమాటం చూపించదు. ఇలా అయినా తన ఫాలోవర్స్ ని అలరించాలని చూస్తుంది అమ్మడు. ప్రియా ప్రకాశ్ వారియర్ కి కెరీర్ లో ఒక సూపర్ హిట్ పడితే అమ్మడి పేరు మారుమోగే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఈ హీరోయిన్ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆ హిట్ సినిమా మాత్రం పడట్లేదు. ప్రియాకి ఆ సూపర్ హిట్ ఇచ్చే సినిమా ఏదవుతుందో చూడాలి. ఫోటో షూట్స్ చేసిన ప్రతీ హీరోయిన్ కు క్రేజ్ వస్తుందని చెప్పడం కష్టం ఐతే వచ్చిన సినిమాల్లోనే తమ టాలెంట్ తో మెప్పిస్తే మాత్రం ఆడియన్స్ మనసు గెలిచే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ విషయంలో ప్రియ ప్రకాష్ ప్లానింగ్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. రాబోతున్న సినిమాలతో అయినా ప్రియా ప్రకాష్ కి కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.