బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ తెరకెక్కించిన సినిమా ''గంగూబాయి కతియావాడి''. ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అజయ్ దేవగణ్ - హ్యూమా ఖురేషి ఇందులో కీలక పాత్రల్లో నటించారు. కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం 2022 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచీ గంగూబాయి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 'గంగూబాయి కతియావాడి' సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల అవుతుండగా.. గంగూబాయి దత్తపుత్రుడు బాబూ రావుజీ షా మరియు గంగూబాయి మనవరాలు భారతి తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు. ''నా తల్లిని వేశ్యగా మార్చారు. ప్రజలు ఇప్పుడు మా అమ్మ గురించి చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు'' అని బాబూ రావుజీ షా ఆవేదన వ్యక్తం చేసారు.
డబ్బు కోసం దురాశతో కుటుంబం పరువు తీశారని గంగూబాయి మనవరాలు భారతి మేకర్స్ పై విరుచుకుపడింది. ''మేకర్లు డబ్బుపై దురాశతో నా ఫ్యామిలీ పరువు తీశారు. దానిని మేము అంగీకరించలేము. ప్రాజెక్ట్ తో ముందుకు సాగడానికి ముందు మీరు మా కుటుంబం అనుమతి అడగలేదు. మీరు పుస్తకం రాసేటప్పుడు మా వద్దకు రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి తీసుకోలేదు. నా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను ఎలా చూపిస్తున్నారు?'' అంటూ భారతి ప్రశ్నించారు.
గతేడాది 'గంగూబాయి కతియావాడి' సినిమాపై బాబూజీ రాజీ షా అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సంజయ్ లీలా భన్సాలీ - అలియా భట్ లకు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆలియా - భన్సాలీ తరపు న్యాయవాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. అంతేకాదు మేకర్స్ పై క్రిమినల్ మరియు పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టే కూడా ఇచ్చిందని తెలుస్తోంది.
ఇకపోతే గంగూబాయిపై సినిమా రూపొందుతోందని తెలిసినప్పటి నుంచి ఆమె కుటుంబం అజ్ఞాతంలో ఉంటుందని.., తరచుగా ఇళ్లు మారుతోందని గంగూబాయి కుటుంబం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కాగా, హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబై’ లోని ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ ఆధారంగా 'గంగూబాయి కతియావాడి' చిత్రం రూపొందుతోంది.
అనుకోని పరిస్థితుల్లో సెక్స్ వర్కర్ గా మారిన గంగూబాయి.. 'మేడమ్ ఆఫ్ కామతిపుర గా రాణిగా ఎలా మారింది? ఆ తర్వాత కాలంలో సెక్స్ వర్కర్ల హక్కుల కోసం ఎలా పోరాడింది? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. పెన్ స్టూడియోస్ - బన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై జయంతిలాల్ గడా - సంజయ్ లీలా బన్సాలీ సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ తెలుగుతో పాటుగా పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.