సింబా.. ప‌చ్చ‌ద‌నం కోసం ప్ర‌కృతి త‌న‌యుడు

Update: 2022-06-05 12:12 GMT
ప్ర‌యోగాల‌కు ఎల్ల‌పుడూ సిద్ధంగా ఉంటారు జ‌గ‌ప‌తిబాబు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అత‌డి ప్ర‌యోగాలు అన్నీ ఇన్నీ కావు. ఇక అత‌డితో రచయితగా.. ద‌ర్శ‌క‌ నిర్మాతగా తనదైన మార్క్ వేసిన‌ సంప‌త్ నంది ప్ర‌యోగం ఆక‌ర్షిస్తోంది. అత‌డు రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ `సింబా` అరణ్యం నేపథ్యంలోని కథతో తెరకెక్కుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్ కు రచయిత సంపత్‌నంది. ‘ది  ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్  స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ముర‌ళీ మోహ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సంప‌త్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. వెర్సటైల్‌ యాక్టర్‌ జగపతిబాబు ‘సింబా’లో ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు.
ఫస్ట్ లుక్‌ పోస్టర్ లో జగపతిబాబు ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అత‌డు త‌న‌ భుజాలపై చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

``ప్రకృతి తనయుడు ఇతడు... జగపతిబాబుగారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. వరల్డ్ ఎన్విరాన్ మెంట్‌ డే సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్‌ సింబాను పరిచయం చేస్తున్నాం`` అని మేకర్స్ రాసిన వాక్యాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. సింబాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. డి.కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తోన్న సింబా చిత్రానికి కృష్ణప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌.

అయితే జ‌గ్గూ భాయ్ అలా దున్నిన పొలంలోంచి ప‌చ్చ‌ని మొక్క‌ను లాక్కుని వెళుతున్నారా?  లేక అక్క‌డ మొక్క‌ను నాటేందుకు తెస్తున్నారా? అన్న‌ది చూడాలి. ప్ర‌కృతి త‌న‌యుడు అని అన్నారు.. అత‌డి రూపం  కూడా ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లా క‌నిపిస్తోంది. అందువల్ల ఈ పాత‌ర‌ను పాజిటివ్ గానే స్వీక‌రించాల్సి ఉంటుందేమో!
Tags:    

Similar News