టీజ‌ర్ టాక్ : తొలి ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు!

Update: 2022-11-21 13:18 GMT
హృద్య‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా రూపొందిన మూవీ `క‌ల‌ర్ ఫొటో`. ఈ సినిమా ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా నేష‌న‌ల్ అవార్డ్ ని ద‌క్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సాయి రాజేష్ నీలం క‌థ అందించారు. జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు, పుర‌స్కారాలు అందుకున్న ఈ మూవీ త‌రువాత ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు సాయి రాజేష్ నీలం రూపొందిస్తున్న సినిమా `బేబీ`. ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్నాడు. వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌రో హీరోగా కీల‌క పాత్ర‌లో విరాజ్ అశ్విన్ న‌టిస్తున్నాడు.

మాస్ మూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని ఎస్ కె ఎన్ నిర్మిస్తున్నాడు. త్వ‌ర‌లో రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీ టీజ‌ర్ ని చిత్ర బృందం సోమ‌వారం విడుద‌ల చేసింది. `మొద‌టి ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు.. మ‌న‌సు పొర‌ల్లోశాశ్వ‌తంగా స‌మాధి చేయ‌బ‌డి వుంటుంది`. అనే అక్ష‌రాల‌తో `బేబీ` టీజర్ మొద‌లైంది. ఇక హీరో, హీరోయిన్ హైస్కూల్ డేస్ కాలం నాటి విజువ‌ల్స్ తో అస‌లు టీజ‌ర్ మొద‌లైంది. స్కూల్ వ‌ద‌ల‌గానే వ‌ర్షం ప‌డుతుంటే ఆ వ‌ర్ష‌పు చినుకుల మ‌ధ్య‌లో త‌ను ప్రేమించిన అమ్మాయిని మురిపెంగా చూస్తూ స్నేహితుల‌తో క‌దులుతున్న హీరో..

త‌నకు త‌న స్కూల్ లో చ‌దివే అమ్మాయికి మ‌ధ్య ప్రేమ చిగురించ‌డం.. ఇద్ద‌రు క‌లిసి ఏకాంత స‌మ‌యాల్ని గ‌డ‌ప‌డం.. వ‌ర్షంలో ఒక‌రి అడుగులో ఒక‌రు వేస్తూ న‌డ‌వ‌డం..క్లాస్ రూమ్ లోనూ ఒక‌రిని ఒక‌రు గ‌మ‌నిస్తూ మురిసిపోవ‌డం... ఏడాది పాటు త‌న‌తో మాట్లాడ‌కుండా దూరం నుంచి చూస్తూ ఓ అమ్మాయి మురిసిపోతున్న స‌న్నివేశాలు.. అది గ‌మ‌నించిన హీరో ఏం చూస్తున్నావ‌ని అడ‌గ‌డం.. త‌ను సిగ్గుతో వెళ్లిపోవ‌డం...

ఇక నుంచి మ‌న ప్రేమ మొద‌ల‌వుతుంది..ఇక నుంచి మ‌న ప్రేమ ఎదుగుతుంది.. అంటూ ఆనంద్  దేవ‌ర‌కొండ చెబుతున్న డైలాగ్ లు సినిమా ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో జ‌రిగిన తొలి ప్రేమ మ‌ధుర జ్ఞాప‌కాల్ని గుర్తు చేసేలా వున్నాయి. ఫైన‌ల్ గా ఐల‌వ్ యూ చెప్పుకోవ‌డం.. ముద్దు పెట్టుకుంటానంటే హీరోయిన్ చెప్పుతెగుద్ద‌ని చెప్ప‌డంఫైన‌ల్ గా ఈ ఇద్ద‌రి మ‌ధ్య‌లోకి మ‌రో క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ కావ‌డం.. త‌న‌కు హీరోయిన్ ప‌రిచ‌యం కావ‌డం.. వంటి డైలాగ్ లు, స్కూల్ ద‌శ నాటి రొమాంటిక్ స‌న్నివేశాల‌తో టీజ‌ర్ ఆట్టుకుంటోంది.

టీజ‌ర్ చూస్తుంటే `బేబీ` ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ మూవీకి విజ‌య్ బుల్గానిన్ సంగీతం అందించ‌గా, ఎం.ఎన్‌. బాలారెడ్డి సినిమాటోగ్రఫీ అందించాడు. ఫైన‌ల్ గా ఈ మూవీతో రౌడీ బ్ర‌ద‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ సాలీడ్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకునేలా వున్నాడ‌ని తెలుస్తోంది. తొలి ప్రేమ జ్ఞాప‌కాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View
Tags:    

Similar News