శివ‌గామి ఎత్తుకున్న ప‌సివాడు ఎవ‌రంటే..

Update: 2017-06-25 06:16 GMT
భార‌త‌దేశ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రికార్డుల్ని బ్రేక్ చేసేయ‌ట‌మే కాదు.. ఇండియ‌న్ సినిమాకు స‌రికొత్త ఇమేజ్‌ ను క‌ట్ట‌బెట్టింది బాహుబ‌లి 2. ఇప్ప‌టికే ఈ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌ల చేసిన స‌మాచారం ప్ర‌కారం 1050 థియేట‌ర్ల‌లో 50 రోజుల పండుగ‌ను ఈ సినిమా పూర్తి చేసుకుంది.

రెండు వారాలు అది కూడా కాదంటే మూడు వారాలు. అంత‌కు మించి ఎంత సూప‌ర్ హిట్ సినిమాను అయినా ఉంచ‌టం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌ని ప‌ని. అలాంటిది యాభై రోజులు 1050 థియేట‌ర్ల‌లో బాహుబ‌లి 2 కంటిన్యూ కావ‌టం మామూలు విష‌యం కాదు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రం ప్రారంభంలో శివ‌గామి పాత్ర‌.. ఒక ప‌సిబాబును.. చేతుల‌తో ప‌ట్టుకొని న‌దిలో వెళ్లే సీన్ ఉంటుంది. తాను మునిగిపోతున్నా.. పిల్లవాడ్ని మాత్రం చేజార‌కుండా ప‌ట్టుకునే సీన్ అంద‌రిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ఈ సీన్ ను శివ‌గామి చేతుల్లో ఉండే ప‌సివాడు రియ‌ల్ అన్నది ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్పుడే పుట్టిన ప‌సికందుగా చూపించిన ఈ ప‌సివాడు 18 నెల‌లు నిండ‌ని అక్షిత్ వ‌ల‌స‌ల‌న్ అనే ఆడ‌పిల్ల అట‌. కేర‌ళ‌లలో షూట్ చేసిన ఈ స‌న్నివేశాన్ని ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ గా వ్య‌వ‌హ‌రించే వ‌ల‌స‌ల‌న్ కుమార్తె అక్షిత‌గా చెబుతున్నారు. రీల్ లో రోజు బిడ్డ అయిన మ‌హేంద్ర బాహుబ‌లిని ప‌ట్టుకున్న శివ‌గామి రియ‌ల్ లైఫ్‌ లో ఆడ‌పిల్ల కావ‌టం.. అది 18నెల‌ల వ‌య‌సు కావ‌టం విశేషం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాను త్వ‌ర‌లో చైనాలో విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 4వేల థియేట‌ర్ల‌లో బాహుబ‌లి 2 చైనాలో రిలీజ్ కానుంది. చైనా త‌ర్వాత ఈ సినిమాను జ‌పాన్‌.. కొరియా.. తైవాన్ లోనూ రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి.. రూ.2వేల కోట్ల క‌లెక్ష‌న్ల పాయింట్‌ ను ట‌చ్ చేసేందుకు ప‌రుగులు పెడుతున్న ఈ మూవీ.. ఈ దేశాల్లో విడుద‌ల‌య్యాక‌.. ఆ మార్క్‌ను ట‌చ్ చేస్తుందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారిన అంశంగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News