సూపర్‌ స్టార్‌ మరో సినిమా డేట్ వచ్చింది

Update: 2022-01-18 13:30 GMT
బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అక్షయ్ కుమార్‌ కరోనా భయం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.. వాటిని ఈ కరోనా సమయంలోనే విడుదల చేస్తున్నారు. షారుఖ్‌ ఖాన్‌.. అమీర్‌ ఖాన్ వంటి స్టార్‌ హీరోలు ఈ కరోనా సమయంలో కనీసం ఒక్కటి అంటే ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేదు. కాని అక్షయ్‌ మాత్రం ఓటీటీ ద్వారా థియేటర్ల ద్వారా అంటూ సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వస్తున్నాయి. సూర్యవంశీ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్‌ మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

అక్షయ్‌ కుమార్‌ హీరోగా ఫర్హద్ సంజీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బచ్చన్‌ పాండే విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా విడుదల తేదీతో ఉన్న పోస్టర్ ను బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కృతి సనన్ షేర్ చేసింది. ఓ భారీ గ్యాంగ్ స్టర్ గా అక్షయ్ కుమార్‌ కనిపించబోతున్నట్లుగా పోస్టర్ లు చూస్తుంటే అర్థం అవుతుంది. ఆయన లుక్ మరోసారి చాలా విభిన్నంగా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా లో అక్షయ్ కుమార్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉండటం వల్ల మరో విజయం ఆయనకు దక్కడం కాయం అనే నమ్మకంను అభిమానులు మరియు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను ఈ హోళీ సందర్బంగా మార్చి 18న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉత్తర భారతం మొత్తం కరోనా వల్ల హాఫ్‌ లాక్ డౌన్‌ లో ఉంది. మార్చి చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కొందరు ప్రముఖులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ తో నడవడంతో పాటు దేశంలో పలు చోట్ల ఆంక్షలు ఉంటాయని అంటున్నారు.

అలాంటి మార్చి 18వ తారీకున సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడం విడ్డూరంగా ఉందంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఖచ్చితంగా అప్పటి వరకు పరిస్థితులు కుదుట పడుతాయని భావించే ఆ తేదీని ప్రకటించారేమో అంటున్నారు. కరోనా కేసులు ఉన్న సమయంలోనే సూర్యవంశీ విడుదల అయ్యింది అయినా కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.. కనుక బచ్చన్‌ పాండే సినిమాను కూడా అదే కోవిడ్‌ పరిస్థితుల్లో విడుదల చేస్తారేమో చూడాలి. ఎప్పుడు విడుదల చేసినా కూడా అక్షయ్‌ కుమార్‌ సినిమాలంటే హాట్ కేక్ అన్నట్లుగా పరిస్థితి మారింది.
Tags:    

Similar News