సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో సత్యం రామలింగరాజు సహా ఆయన బంధుగణం అరెస్టులు సంచలనం అయ్యాయి. ఇప్పుడు ఈ రియల్ ఇన్సిడెంట్ పై డాక్యుమెంటరీ కం డాక్యు సిరీస్ ని తెరకెక్కించి రిలీజ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై రామలింగరాజు సహా పలువురు కోర్టు కేసులు వేయడంతో వాయిదా పడిన సంగతి విధితమే. టీజర్ ట్రైలర్ లు ఇప్పటికే రిలీజయ్యాయి. వీటిపై రాజు తదితరుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.
`బాడ్ బాయ్ బిలియనీర్స్` అనే టైటిల్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేయాలా వద్దా? అన్నదానిని తెలంగాణ హైకోర్టు నిర్ణయించనుంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. చీఫ్ జస్టిస్ రాఘ్వేంద్ర సింగ్ చౌహాన్.. జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి. రామలింగరాజు ఇతరుల జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీని చూడాలని నిర్ణయించారు. నెట్ ఫ్లిక్స్ దాఖలు చేసిన అప్పీల్ లో రాజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి శుక్రవారం న్యాయవాదిని ఆదేశించారు. నెట్ ఫ్లిక్స్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ ఈ డాక్యుమెంటరీని పబ్లిక్ డొమైన్ లో లభించిన ముడిసరుకుతోనే తెరకెక్కించామని వివరాలు సమర్పించారు. ట్రయల్ కోర్టు OTT ప్లాట్‌ఫాం వినకుండా విడుదలను నిలిపివేసిందని ఆయన అన్నారు.
సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజు సహా ఇతరులు ఇప్పటికే దోషులుగా ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కౌల్ ఈ డాక్యుమెంటరీని చూడాలని ధర్మాసనానికి సూచించారు. అయితే రాజు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డితో పాటు డాక్యుమెంటరీని చూడాలని న్యాయమూర్తులు ఆయనకు చెప్పారు.
కేవలం 49 సెకన్ల ట్రైలర్ చూసిన తర్వాత డాక్యుమెంటరీ విడుదలను నిలిపివేయడం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని నెట్ ఫ్లిక్స్ తరపున లాయర్ వాదించారు. డాక్యుమెంటరీని చూడాలని నిర్ణయించగా.. తదుపరి విచారణ కోసం ధర్మాసనం కేసును సెప్టెంబర్ 25 కి వాయిదా వేసింది. సెప్టెంబర్ 1 న రాజు అభ్యంతరాలు పరిశీలించి ఈ సిరీస్ ను ప్రసారం చేయకుండా నెట్ ఫ్లిక్స్ ను హైదరాబాద్ సివిల్ కోర్టు నిరోధించింది. ఇక మద్యం బారన్ విజయ్ మాల్యా.. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ.. సహారా ఇండియా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్.. రాజు జీవితాల ఆధారంగా రూపొందించిన ఈ డాక్యు సిరీస్ ప్రకంపనాలు సృష్టించేందుకు ఆస్కారం ఉందని అంచనా.
7 జనవరి 2009 న రూ.7000 కోట్లకు సంబంధించిన సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చాలా సంవత్సరాలుగా అంచనా పెంచి అనేక కోట్ల రూపాయల వరకు షేర్ విలువ పెంచామని రాజు కోర్టులో అంగీకరించారు. అనంతరం ఈ కేసులో రాజు.. అతని ఇద్దరు సోదరులు.. మరో ఏడుగురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన ప్రత్యేక సిబిఐ కోర్టు 2015 ఏప్రిల్ 9 న భారతదేశపు అతిపెద్ద కార్పొరేట్ మోసం ఇదని పేర్కొంది. అయితే ఒక నెల తరువాత మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు వారి శిక్షను నిలిపివేసింది. రాజు అతని సోదరుడు రామ రాజు.. కంపెనీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాస్ వడ్లమణిలను 2018 లో బెయిల్ పై విడుదల చేశారు.