మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఖిలాడీ''. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటుగా హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసారు. అయితే మొదటిరోజే ప్రేక్షకుల నుంచి ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
హిందీ డబ్బింగ్ మార్కెట్ లో క్రేజ్ ఉన్న సౌత్ ఇండియన్ హీరోలలో రవితేజ ఒకరు. మాస్ రాజా సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ నార్త్ లో మంచి ఆదరణ తెచ్చుకుంటాయి. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబడుతుంటాయి. అందుకే బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ “ఖిలాడీ” హిందీ హక్కులను కొనుగోలు చేసింది.
అంతేకాదు సత్యనారాయణ కోనేరుకు చెందిన హవీష్ ప్రొడక్షన్స్ - ఎ స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి పెన్ ఇండియా వారు సినిమా నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' సినిమా బాలీవుడ్ లో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.
దీంతో రవితేజ 'ఖిలాడీ' ని కూడా ఏకకాలంలో హిందీలోనూ థియేట్రికల్ రిలీజ్ చేయాలని పెన్ సంస్థ భావించింది. ముంబై - ఢిల్లీ సహా ఇతర మేజర్ నార్త్ మార్కెట్ లో పోయిన శుక్రవారం విడుదలైంది. అయితే హిందీ డబ్బింగ్ మార్కెట్ లో రవితేజకు క్రేజ్ ఉన్నప్పటికీ.. బాలీవుడ్ డెబ్యూ సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు.
ఖిలాడీ హిందీ వెర్షన్ కలెక్షన్స్ దాదాపు సూన్యమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో భారీ ప్లాప్ తో రవితేజకు బాలీవుడ్ స్వాగతం పలికినట్లైంది. దీనిని బట్టి యూట్యూబ్ లో డబ్బింగ్ వెర్షన్స్ కు వచ్చే మిలియన్ల వ్యూస్ ని చూసి హిందీలోనూ రిలీజ్ చేస్తే.. ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి లేదని అర్థం అవుతోంది.
పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమాలను విడుదల చేస్తేనే ఉత్తరాది ఆడియన్స్ కూడా ఆదరిస్తారని మేకర్స్ తెలుసుకుంటే నష్టాల నుంచి బయటపడొచ్చు. ఇకపోతే రవితేజకు డబ్బింగ్ మార్కెట్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా 'ఖిలాడీ' నిర్మాతలు దాదాపుగా 20 కోట్లకు రైట్స్ అమ్మారని టాక్ ఉంది.
రవితేజ లైనప్ లో ఉన్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కచేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటుగా మరికొన్ని చిత్రాలను హిందీలో డబ్బింగ్ చేసే అవకాశం ఉంది. మరి ఈసారి బాలీవుడ్ లో మన టాలీవుడ్ హీరో సత్తా చాటుతారేమో చూడాలి.
కాగా, 'ఖిలాడీ' చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయగా.. మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సుజిత్ వాసుదేవ్ మరియు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు.