టాలీవుడ్ కి కష్టకాలం నడుస్తోందా?

Update: 2018-01-10 17:30 GMT
ఏదైనా ఒక రంగంలో ఎప్పుడూ ఏదో ఒక విభాగానికి సమస్యలు ఉండడం సహజమే. అయితే.. ఒకేసారి అనేక రంగాలను ప్రాబ్లెమ్స్ చుట్టుముట్టడం అంటే ఆలోచించాల్సిన విషయమే. పైగా పలు విభాగాలు ఇప్పటికే కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవడంతో.. త్వరలో తెలుగు సినీ రంగానికి సమస్యలు తీవ్రం కానున్నాయని అంటున్నారు.

మార్చ్ 1నుంచి థియేటర్లను మూసివేస్తున్నట్లుగా ఇప్పటికే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చెబుతోంది. డిజిటల్ ప్రొజెక్షన్ కారణంగా.. సర్వీస్ ఛార్జీలు పెరిగిపోయాయని.. ఇది థియేటర్లపై మోయలేని భారం మోపుతోందని చెబుతున్నారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ రంగం టాలీవుడ్ లో ఓ నలుగురి చేతిలో ఇరుక్కుపోయిందనే మాటలు గతం నుంచి వినిపిస్తున్నాయి. జైసింహా ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించడం గమనార్హం. మరోవైపు నిర్మాతలలో యూనిటీ లేదనే మాట వినిపిస్తోంది. డబ్బింగ్ సినమాలను పండుగ  సీజన్లలో రిలీజ్ చేయరాదనే నిర్ణయం తీసుకుంటే.. దీనికి అందరి నుంచి సపోర్ట్ లభించలేదు. మరోవైపు టికెట్ల రేట్ల పెంపు కూడా సినిమాలకు వచ్చే ఆడియన్స్ పై ప్రభావం చూపనుందని అంటున్నారు.

వీటన్నటికి తోడు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం మరింతగా చేటు చేస్తోంది. కొన్ని వారాల వ్యవధిలోనే పలు డిజిటల్ ప్లాట్ ఫాంపై హైక్వాలిటీ ప్రింట్స్ వచ్చేస్తుండడంతో స్టార్ల సినిమాలు మినహా మిగతావాటి కోసం థియేటర్లకు జనాలు రావడం లేదు. ఒకేసారి తెలుగు సినిమా రంగాన్ని ఇన్నేసి కష్టాలు వచ్చేయడం.. ఏకంగా థియేటర్లను మూసివేసే వరకు కథ నడుస్తుండడం గమనార్హం.
Tags:    

Similar News