ఆ డైరెక్టర్ బ్యాడ్ టైం ఇంకా కొనసాగుతోందట!

Update: 2020-03-12 12:20 GMT
ఆయన మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన డైరెక్టర్. అయితే చివరిగా ఆయన ఓ మెగా హీరోతో తెరకెక్కించిన సినిమా బయ్యర్లకే కాకుండా ప్రేక్షకులకు.. హీరోకు కూడా తలబొప్పి కట్టించింది. ఇదిలా ఉంటే ఈ దర్శకుడు తన శిష్యుడు డైరెక్టర్ గా పరిచయం అయిన సినిమాలో బ్యాకెండ్ లో పెట్టుబడి పెట్టాడట. గురువుగారి లాగే శిష్యుడు కూడా ఊరమాసు గా సినిమాను తీయడంతో అది కాస్తా ఫ్లాప్ గా నిలిచింది. దీంతో ఈ దర్శకుడికి చేతి చమురు వదిలిందట.

ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ డైరెక్టర్ అతి కష్టం మీద ఒక సీనియర్ స్టార్ హీరోతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ దర్శకుడు - ఆ సీనియర్ హీరో కాంబినేషన్ క్రేజీనే కానీ ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు. ఆ హీరో సినిమాలు ఈమధ్య ఒకదానిని మించి మరొకటి ఫ్లాపులు అవుతూ బయ్యర్లనే కాకుండా నిర్మాతలను కూడా బెదరగొడుతున్నాయి. దీంతో ఈ సినిమా నిర్మాత బడ్జెట్ ను వీలైనంత తగ్గించే పొదుపు చర్యలు పాటిస్తున్నాడట. అందులో భాగంగా ఈ దర్శకుడి రెమ్యూనరేషన్ కు ఒక కండిషన్ పెట్టాడట. మొత్తం పారితోషికంలో 25% మాత్రమే డబ్బు రూపం లో ఇస్తానని.. మిగతా సినిమా లాభాల్లో వాటా తీసుకోమని అంటున్నాడట.

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చినట్టుగా ఒక్క మెగా డిజాస్టర్ ఈ దర్శకుడి కెరీర్ ను అతలాకుతలం చేసిందని ఈ దర్శకుడిపై ఫిలిం నగర్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమా ఫలితం కనుక అటూ ఇటూ అయితే కెరీర్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పడడం ఖాయమని అంటున్నారు. మరి ఈ దర్శకుడు ఆ ఖతర్నాక్ సీనియర్ స్టార్ తో ఎలాంటి సినిమా చేస్తాడో.. ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి.
Tags:    

Similar News