బాఫ్టా 2021: ప్రియాంక చోప్రా స్ట‌న్నింగ్ రెడ్ కార్పెట్ లుక్

Update: 2021-04-12 08:30 GMT
ఆస్కార్ అవార్డుల్లో త‌ళుకుబెళుకుల గురించి ముచ్చ‌ట తెర‌మ‌రుగు కాక‌ముందే లండన్ లో జరిగిన బాఫ్టా అవార్డ్స్ 2021 వేడుక‌ల్లో ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ ట్రీట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట అన్యోన్య‌త రెడ్ కార్పెట్ న‌డ‌క‌లు షోస్టాప‌ర్ గా నిలిచాయి. లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ ‌లో జరిగిన ఈ వేడుక‌ల్లో ప్రియాంక - నిక్ సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు.

ప్రియాంక చోప్రా డిజైన‌ర్ లుక్ ఈ వేదిక వ‌ద్ద ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక వేదిక ఆద్యంతం పీసీపైనే క‌ళ్ల‌న్నీ. పీసీ ఎంపిక చేసుకున్న ఆ వ‌స్త్రాల ఖ‌రీదు ల‌క్ష‌ల్లో ఉంటుంద‌న్న టాక్ న‌డిచింది. పీసీ ఎంపిక‌లు ప‌రిశీలిస్తే.. ప్ర‌ఖ్యాత‌ పెర్టెగాజ్ స్టూడియోస్ కి చెందిన‌ సిల్కీ వైట్ ప్యాంటు క్రిస్టియన్ లౌబౌటిన్ బ్లాక్ పైప్ డ్రెస్ ని ధ‌రించింది. ఓపెన్ ఫ్రంట్ లుక్ తో పీసీ  ఎంతో హాట్ గా క‌నిపించింది.  జార్జియో అర్మానీ స్టూడియోల నుండి ఒక నల్ల తక్సేడోలో నిక్ జోనాస్ క‌నిపించారు.

ఇదే వేడుక‌ల‌కు ముందు డిజైనర్ రోనాల్డ్ వాన్ డెర్ కెంప్ రూపొందించిన బ్లాక్ సెపరేట్స్ - లంగా జాకెట్ లో పీసీ ప్ర‌త్య‌క్ష‌మైంది. సీతాకోకచిలుక స్ఫూర్తితో రూపొందించిన డిజైన‌ర్ లుక్ ఇది. ప్రియాంక మెరిసే ఆభరణాలు బుల్గారి అల్మారాల నుండి ఎంపిక చేసిన‌వి. ఆస్కార్ 2021 ..  కేన్స్ స‌హా ఎన్నో విఖ్యాత అవార్డు వేదిక‌ల‌పై పీసీ - నిక్ జోడీ మెరుపులు మెరిపించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News