బాహుబలి విడుదలైన అన్నిచోట్లా రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 400కోట్ల మార్క్‌ని తాకింది. కేవలం ఏపీ, తెలంగాణలోనే 82కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అయితే ఇంత సాధించాక కూడా ఇప్పటికీ ఈ సినిమా టిక్కెట్లు దొరకని పరిస్థితి. అంతేకాదండోయ్ .. బాహుబలి తమిళ వెర్షన్ లో ఓ డైలాగ్ అక్కడ దళితుల్ని హర్ట్ చేసింది. నిన్నటిరోజున కొందరు దళితులు తమిళనాడు తళ్లకులమ్ థియేటర్ పై పెట్రోల్ బాంబ్ విసిరి అలజడి సృష్టించారు.
ఇందులో పగడై అంటూ కులాన్ని కించపరిచే పదాన్ని ఉపయోగించడం అక్కడ దళితులకు ఆగ్రహం తెప్పించింది. పగడై అంటే తమిళనాడు గిరిజనుల్లో సక్కిలియార్ కులస్తులకు సంబంధించిన ఓ టీజింగ్ వర్డ్. అందుకే ఇంతగా రెచ్చిపోయి నిరసనకారులు తెగబడ్డారు. అయితే ఈ పదాన్ని త్వరలోనే తొలగిస్తామని బాహుబలి నిర్మాతలు ప్రకటించారు. అంతేకాదు.. ఈ డైలాగ్ రాసిన రచయిత మదన్ నేరుగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరాడు. తప్పు జరిగిపోయింది. ఆ పదాన్ని తొలగించే బాధ్యత నాది. అయితే అది కేవలం కథలో భాగంగా బానిసత్వాన్ని ఎలివేట్ చేసే మాటలో సందర్భోచితంగా ఉపయోగించినది మాత్రమే. కావాలని ఉద్ధేశపూర్వకంగా రాయలేదని బదులిచ్చాడు. అదీ సంగతి.