అరవింద్ స్వామికి అరుదైన అవకాశం

Update: 2017-01-01 09:15 GMT
రోజా.. బొంబాయి లాంటి సినిమాలతో 90ల్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన అరవింద్ స్వామి.. చాలా త్వరగా కెరీర్ ముగించేసి వ్యాపారాల వైపు మళ్లాడు. ఓ దశలో బాగా లావై.. జుట్టంతా పోయి.. షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు అరవింద్. ఆ అవతారంలో అతణ్ని చూసి ఇక మళ్లీ సినిమాలు చేయడం కలే అనుకున్నారంతా. కానీ బరువు తగ్గి.. హేర్ సెట్ చేయించుకుని సరికొత్త లుక్ లోకి మారి.. మళ్లీ ‘కడలి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు అరవింద్. ఆ సినిమా నిరాశ పరిచినా.. ‘తనీ ఒరువన్’ అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. దీని రీమేక్ ‘ధృవ’తో తెలుగు ప్రేక్షకులనూ మురిపించాడు అరవింద్.

ఈ దెబ్బతో అతడికి మంచి మంచి అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఆల్రెడీ ప్రభుదేవా ప్రొడక్షన్లో జయం రవి కాంబినేషన్లో ‘బోగన్’ అనే సినిమా చేస్తున్నాడు. త్రిషతో కలిసి ‘శతురంగ వేట్టై-2’ కూడా చేస్తున్నాడు. తాజాగా అరవింద్ స్వామికి ఓ అరుదైన అవకాశం దక్కింది. తమిళ విలక్షణ దర్శకుడు బాల డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. గత ఏడాది ‘తారై తాపట్టై’ అనే వైవిధ్యమైన సినిమా చేసిన బాల.. ప్రస్తుతం ఐదుగురు కథానాయకులతో ఓ మెగా మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో రానా దగ్గుబాటి కూడా నటిస్తాడని వార్తలొచ్చాయి. రానా సంగతేమో కానీ.. అరవింద్ మాత్రం ఓ పాత్రకు ఎంపికయ్యాడు. బాల లాంటి దర్శకుడితో అరవింద్ సినిమా అనగానే జనాల్లో క్యూరియాసిటీ మొదలైంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News