ఒకప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్టు అనేది అది వంద రోజులాడే సెంటర్లను బట్టి లెక్కగట్టేవాళ్లు. కానీ ఇప్పుడంతా కలెక్షన్ల లెక్కలే ప్రామాణికం అయ్యాయి. అయినప్పటికీ ఈ రోజుల్లో కూడా కొన్ని సినిమాలు ఎలాగోలా వంద రోజులు ఆడేస్తున్నాయి. అభిమానులు ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఒక థియేటర్లో 400 రోజులకు పైగా ఆడితే.. మరో కడప జిల్లా ప్రొద్దుటూరులోని మరో థియేటర్లో ఏకంగా వెయ్యి రోజులకు పైగా ఆడి చరిత్ర సృష్టించింది. ‘లెజెండ్’ తర్వాత బాలయ్యకు ఘనవిజయాన్నందించిన ఆయన వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సైతం ఆంధ్రప్రదేశ్ లోని మూడు సెంటర్లలో వంద రోజులు ఆడటం విశేషం. ఈ మూడింట్లో రెండు కర్నూలు జిల్లాలోనే ఉండటం విశేషం.
‘లెజెండ్’ను 400 రోజులు ఆడనిచ్చిన ఎమ్మిగనూరు జనాలు.. ‘శాతకర్ణి’కి కూడా వంద రోజుల మైలురాయిని అందించారు. కర్నూలు టౌన్ గూడూరులోని ఓ థియేటర్లోనూ ఈ సినిమా వంద రోజులు ఆడింది. విజయవాడలో షిఫ్టింగ్ ద్వారా ‘శాతకర్ణి’ సెంచరీ మార్కును చేరుకుంది. ఐతే ‘లెజెండ్’ సినిమాను ఆడించినట్లు అభిమానులు వంద రోజుల తర్వాత కూడా కొనసాగనిస్తారా అన్నది చూడాలిప్పుడు. కర్నూలు జిల్లా ఫ్యాన్స్ ఇందుకు ఫేమస్ కాబట్టి.. ‘శాతకర్ణి’ కూడా సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తాడేమో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/