గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో 100 సినిమాలు పూర్తి చేసిన నటుడు బాలకృష్ణ తర్వాత వేగం పెంచాడు. 101వ సినిమాకు డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కు అవకాశమివ్వడం అందరినీ ఆశ్చర్య పరిచింది. పైసా వసూల్ లో తేడా సింగ్ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి తప్ప సినిమా పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేదు. దీంతో బాలకృష్ణ తన తర్వాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.
తమిళ్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో బాలకృష్ణ లేటెస్ట్ గా సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి నాటికి ఈ మూవీని థియేటర్లకు తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించారు. అందుకే షూటింగ్ లో ఎక్కడా జాప్యం లేకుండా చకాచకా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి టాకీపార్ట్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. ఓ భారీ ఫైట్ చిత్రీకరణ పూర్తి చేశారని... దీంతో క్లైమాక్స్ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చినట్టేనని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.
బాలకృష్ణ హీరోయిన్ గా నయనతార కనిపించడం ఇది ముచ్చటగా ఇది మూడోసారి. ఇప్పటికే సింహా - శ్రీరామరాజ్యం సినిమాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో వీరి కాంబినేషన్ మరోసారి హిట్ కొడుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. కె.ఎస్.రవికుమార్ వారి ఆశలను ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి మరి.