నందమూరి నటసింహం బాలకృష్ణ (NBK) పవర్ ఫుల్ స్పీచ్ ఎలా ఉంటుందో నిన్నటి సాయంత్రం ఒంగోలు ప్రీరిలీజ్ వేదికపై చూశాం. వీరసింహారెడ్డి ఈవెంట్ గ్రాండ్ సక్సెసైంది. అన్ని అడ్డంకులను అధిగమించి విజయవంతం చేయడంలో మైత్రి అధినేతల పట్టుదల ఇప్పుడు చర్చకు వస్తోంది.
ఇకపోతే ఈ ప్రీరిలీజ్ వేదికపై బాలకృష్ణ తదుపరి నటించే ఓ మూడు సినిమాలపై చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. వీరసింహారెడ్డి రిలీజ్ కాగానే తదుపరి అనీల్ రావిపూడితో సినిమాని బాలయ్య అత్యంత వేగంగా పూర్తి చేస్తారు. అనీల్ రావిపూడి కూడా మరో మంగోలియన్.. నెక్ట్స్ ఉంది! అంటూ బాలయ్య ఉత్సాహంగా ఈ వేదికపై వెల్లడించారు. అలాగే వేదిక వద్ద ఆదిత్య 369 కటౌట్ అంతే ఆసక్తికరంగా కనిపించింది. దీని ఉద్ధేశం కచ్ఛితంగా బాలకృష్ణ తదుపరి సినిమా ఆదిత్య 369 సీక్వెల్ (ఆదిత్య 999 మ్యాక్స్) అని అర్థమవుతోంది. ఈ సినిమాతో తనయుడు మోక్షజ్ఞను లాంచ్ చేసేందుకు ఆయన ఉరకలెత్తుతున్నారు. అందుకే ఈ ప్రత్యేక కటౌట్ ఒంగోలు వెన్యూ వద్ద హైలైట్ అయ్యిందన్న ముచ్చటా అభిమానుల్లో కొనసాగింది.
అయితే బాలయ్య బాబుకు నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన బి.గోపాల్ కి అవకాశం ఉందా? అన్న గుసగుస కూడా ఈ వేదిక వద్ద వేడెక్కించింది. నిజానికి చాలా కాలంగా బాలకృష్ణతో మూవీ అవకాశం కోసం సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఎదురు చూస్తున్నారని కథనాలొచ్చాయి. ఆయన బౌండ్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నారు. కానీ డేట్ మాత్రమే ఫిక్సవ్వడం లేదు. బహుశా వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేదిక సాక్షిగా బి.గోపాల్ కి తదుపరి అవకాశం ఉంటుందని బాలయ్య ఆల్మోస్ట్ హింట్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ బాలకృష్ణను సదరు సీనియర్ దర్శకుడు ఛంఘీజ్ ఖాన్ గా చూపిస్తారా? అన్న గుసగుస కూడా మొదలైంది ఇపుడు. ''ఛంఘీజ్ ఖాన్ సినిమా చేస్తా.. నా జీవితాశయం!.. కానీ టైమ్ రావాలి!!'' అంటూ బాలయ్య బాబు వేదికపై కాస్త పెద్ద సౌండ్ తోనే అన్నారు. అయితే ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహిస్తారా లేక సదరు సీనియర్ దర్శకుడు తన బాణీలో వేరొక ఫ్యాక్షన్ స్క్రిప్టునే బాలయ్యకు వినిపించారా? అన్నది తెలియాల్సి ఉంది.
బి.గోపాల్ గతంలో బాలయ్యతో లారీ డ్రైవర్- రౌడీ ఇన్ స్పెక్టర్- సమర సింహారెడ్డి- నరసింహానాయుడు లాంటి నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అందుకే అతడికి మరో అవకాశం ఉండనే ఉందన్న గుసగుసా అభిమానుల్లో వేడెక్కించింది.
ఇక ఈ వేదికపై బాలయ్య స్పీచ్ మధ్యలో ఒంగోలియన్ మంగోలియన్ అని స్మరిస్తూనే అనీల్ రావిపూడి పేరును ప్రస్థావించడం కొత్త డౌట్ పెట్టేసింది. ఒకవేళ ఛంఘీజ్ ఖాన్ కథాంశాన్ని అనీల్ రావిపూడి హ్యాండిల్ చేస్తున్నారా? లేక అతడు ఎంపిక చేసుకున్న కథాంశం ఎఫ్ 3 - పటాస్ తరహానా? అన్నది తనే స్వయంగా వెల్లడించాల్సి ఉంది. బాలయ్య బాబు ఎగ్జయిట్ మెంట్ ఉత్సాహాన్ని చూశాక ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. మంగోలియనే అంటూ అనీల్ రావిపూడిపైనా బాలయ్య కామెంట్ చేయడం చూస్తుంటే ఛంఘీజ్ ఖాన్ స్క్రిప్టుపైనా అతడు వర్కవుట్ చేస్తున్నారా? అన్న సందేహం రేకెత్తింది. బాలయ్యలో ఉప్పొంగిన ఉత్సాహం .. వేదిక ఆద్యంతం ఉద్విగ్నమైన స్పీచ్.. 60 ప్లస్ లోనూ ఆ జోరు ఆశ్చర్యపరిచింది. చాలా జానర్లు చేసాను. ఇంకా కాక తీరలే! అంటూ బాలకృష్ణ జోష్ చూపించడంతో మాస్ గాడ్ నుంచి మరిన్ని విలక్షణ సినిమాలను ఆశించవచ్చని అభిమానులు భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.