బాలయ్యకు కోపం ఎక్కువకాదు మిత్రమా!

Update: 2017-01-19 07:01 GMT
నందమూరి బాలకృష్ణ వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" సంక్రాంతి సందర్భంగా విడుదలై హిట్ టాక్‌ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తనదైన కలెక్షన్స్ సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తుంది. ఈ సందర్భంగా ఫుల్ హుషారుగా ఉన్న బాలయ్య... ఈ సినిమా సక్సెస్ పై మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాను ఈస్థాయిలో ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్న బాలయ్య ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన విషయాల్లో "బాలయ్యకు కోపం ఎక్కువ" అనేది ఒకటి!

అవును... "బాలయ్యకు కోపం ఎక్కువ" అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? అనే ప్రశ్న బాలయ్యకు తాజాగా ఎదురైంది. అయితే ఈ విషయాలపై తనదైన శైలిలో స్పందించిన బాలయ్య... "చాలామంది నాకు కోపం ఎక్కువని అనుకుంటారు కానీ.. అందులో ఏ మాత్రం నిజం లేదు" అని చెప్పారు. అందరితో చాలా సరదాగా ఉండటమే కాకుండా, ప్రజలందరితోనూ త్వరగా కలిసిపోయే మనస్థత్వం తనదని, ఇంట్లో కూడా తన పిల్లలు ఇమిటేట్ చేస్తే నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారని చెబుతున్నారు బాలయ్య.

ఇదే సందర్భంలో నిత్యం తన సినిమాలపై నేరుగా కామెంట్ చేస్తూ ఆ సినిమాలోని ప్లస్సులూ - మైనస్సుల గురించి నిర్మొహమాటంగా చెప్పే తన కుటుంబ సభ్యులంతా.. "గౌతమీపుత్ర శాతకర్ణిలో ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు" అని చెప్పడం తనకెంతో సంతృప్తినిచ్చిందని అన్నారు బాలయ్య. ఇదే సమయంలో ఒకపక్క ఎమ్మెల్యేగా, మరోపక్క సినీ నటుడిగా మరో పక్క కేన్సర్ ఆస్పత్రి యాజమాన్య బాధ్యతలు నిర్వర్తిస్తూ ఫుల్ బిజీగా ఉన్నానని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News