ఒకవైపు చిరంజీవి దాదాపు రెండువందల కోట్ల రూపాయల పై స్థాయి బడ్జెట్ తో సినిమాను రెడీ చేస్తున్నారు. ఇక సాహో వంటి సినిమాను మూడు వందల కోట్ల రూపాయల పై స్థాయి బడ్జెట్ తో రూపొందించారు. ఇలా తెలుగు సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందించడం రొటీన్ అయ్యింది. పెద్ద హీరోల సినిమాలకు ఇప్పుడు బడ్జెట్ అనేది భారీ స్థాయిలోనే ఉంటోంది.
ఇలాంటి క్రమంలో కొంతమంది హీరోలు మాత్రం భారీ బడ్జెట్ అంటే భయపడుతూ ఉన్నారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరని తెలుస్తోంది. సీనియర్ హీరోయిన బాలకృష్ణ తన రేంజ్ ఏమిటో ఎరిగి వ్యవహరిస్తూ ఉన్నారని ఇండస్ట్రీ టాక్.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా రూపొందబోతోందనేది తెలిసిన సంగతే. ఈ క్రమంలో ఆ సినిమా బడ్జెట్ గురించి బోయపాటి భారీ నంబర్ ను చెప్పారట. కనీసం యాభై నుంచి అరవై కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆ సినిమాను రూపొందించాలని బోయపాటి అనుకుంటున్నాడట. ఇదే ఆలోచనను అతడు బాలకృష్ణకు వివరించినట్టుగా తెలుస్తోంది. అయితే బాలకృష్ణ మాత్రం అందుకు సమ్మతించలేదని సమాచారం.
ఎటు తిరిగీ సినిమాను ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ తో పూర్తి చేయాలని బాలకృష్ణ ఆర్డర్స్ ఇచ్చేశాడట. అంతకు మించి బడ్జెట్ వద్దని.. తన మార్కెట్ కు తగిన స్థాయిలో మాత్రమే సినిమాను పూర్తి చేయాలని స్పష్టం చేశాడట. ఇది వరకూ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో బడ్జెట్ భారీ స్థాయికి వెళ్లి పోయి ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అనిపించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ జాగ్రత్తలు పడుతున్నట్టున్నారు.