సంక్రాంతి సినిమాల్లా టాప్ గా నిలించింది నాన్నకు ప్రేమతో. అత్యధిక వసూళ్లతో పాటు, డిఫరెంట్ ప్రయత్నానికి ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. తొలి వీకెండ్ (నాలుగు రోజులకు) కి 35 కోట్ల వసూళ్లతో సత్తా చాటుతున్న ఎన్టీఆర్ కు.. డిక్టేటర్ కారణంగా పెద్ద దెబ్బే పడిందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.
నాన్నకు ప్రేమతో మూవీకి క్లాస్ మూవీ అనే టాక్ రావడంతో బీ - సీ సెంటర్లో కలెక్షన్స్ తగ్గుతాయని భావించారు. అయితే.. అక్కడ కూడా జూనియర్ మూవీ స్ట్రాంగ్ గానే ఉంది. కానీ నాన్నకు ప్రేమతో వచ్చిన మరుసటి రోజే డిక్టేటర్ రావడంతో.. ఈ దెబ్బ సీడెడ్ లో గట్టిగానే పడింది. ఇక్కడి నుంచి తొలి నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ మూవీకి 4.5 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఒక వేళ డిక్టేటర్ తో పోటీ లేకుండా ఉంటే.. ఖచ్చితంగా 6కోట్లపైగానే ఈ అంకెలు ఉండేవి. ఎందుకంటే.. సీడెడ్ లో ఎన్టీఆర్ కి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.
ఇక కోస్టల్ జిల్లాల్లో కూడా డిక్టేటర్ ఎఫెక్ట్ నాన్నకు ప్రేమతోపై పడిందనే చెప్పాలి. అయితే.. బాలయ్య డిక్టేటర్ కు కోస్తా, సీమల్లో కలెక్షన్స్ బాగానే వస్తున్నా, నైజాంలో మాత్రం వసూళ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఓవర్సీస్ లో అయితే, అసలు మాట్లాడుకోకపోవడమే బెటర్ అంటున్నారు. మొత్తానికి బాబాయ్, అబ్బాయ్ లు మంచి పోటీ మధ్య వచ్చి, ఇద్దరికీ చేటు చేసుకున్నారన్నది ఇండస్ట్రీ ఒపీనియన్.