నటసింహం.. సినీ చరిత్రకే ఓ సువర్ణకిరీటం

Update: 2015-06-10 09:39 GMT
మంగమ్మ గారి మనవడి నుండి నేటి లయన్‌ వరకు.. సినిమాల రిజల్ట్‌ ఎలా ఉన్నా కూడా సినిమాల పట్ల నందమూరి బాలయ్యకు ఉన్న గౌరవం అమోఘం. ఆ గౌరవమే కాబోలు.. ఆయన్ను ఒక పవర్‌ఫుల్‌ నటుడిగా, ఒక తరాన్ని శాసించే శక్తిగా మార్చేశాయ్‌. నటసింహం అనే పేరు వింటే ఫిలిం లవర్స్‌ ఎవరైనా తన్మయంత్వంలో ఊగిపోవాల్సిందే. 40 ఏళ్ళ కెరియర్‌లో ఒక ప్రక్కన నాన్న ఎన్టీఆర్‌ గౌరవాన్ని నిలబెడుతూ మరో ప్రక్కన తన స్టయిల్లో తాను ఓ మాస్‌ స్టార్‌గా ఎదిగిపోయారు.

ఒక్కసారి కమిట్‌ అయితే డైరక్టర్‌ మాట తప్పితే ఎవరి మాటా వినరు ఆయన. ఇటు హిందూపూర్‌ ఎమ్మెల్యేగా ఉంటూనే అటు సినిమాలకు సూపర్బ్‌ కమిటెడ్‌గా టైమ్‌ను కేటాయిస్తున్నారు. పంచ్‌ డైలాగ్‌లకు కొత్త ఒరవడి అలవాటు చేసిందే బాలయ్య. తనకంటే ఎత్తయిన హీరోయిన్‌తో నటిస్తారు, తనకంటే వయస్సులో చిన్నవాళ్ళకి ఏమండీ అంటూ గౌరవమిస్తారు. సినిమాల్లోనే కాదు, రియల్‌ లైఫ్‌లో కూడా ఆయన ఇచ్చే రెస్పెక్ట్‌ పుచ్చుకుంటే ఆ కిక్కే వేరు. సినిమాను ఒక బిజినెస్‌లా కాకుండా ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ టూల్‌గా చూడటం వలనే బహుశా ఇన్నేళ్ళు ఆయన తెర మీద రాణిస్తూ అద్భుతాలు సాధించగలుగుతున్నారేమో.

ఇక ఎలాంటి రోల్స్‌ చేశారూ, ఏది ఎలా చేశారు అని చెప్పుకోవక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏ రోల్‌ చేసినా అది సూపరే. ఇన్స్‌పెక్టర్‌ రాముడైనా, సాక్షాత్తూ శ్రీరాముడైనా, పోలీస్‌ అయినా, డాక్టర్‌ అయినా.. బాలయ్య రూటే సెపరేటు. తెలుగు సినిమా చరిత్ర పేజీల్లో సొంతంగా తమ కంటూ కొన్ని చాప్టర్లు లిఖించుకున్న నటుల్లో బాలయ్య ఒకరంటే అతిశయోక్తి కాదు. రాజుగారి కొడుకు రాజే అవుతాడు అన్నట్లు ఓ మహానటుడి నటవారసుడు కించెత్‌ కూడా మచ్చ తీసుకురాని మరో గొప్ప నటుడని వేరే చెప్పక్కర్లేదు. మకుటం ఉన్న మహారాజే ఈయన.

ఈ నటసింహ గర్జన త్వరలో చారిత్రాత్మక 100వ సినిమా ద్వారా రికార్డు పుస్తకాల పూసాలు కదిలిపోయేలా గర్జిస్తారని ఫ్యాన్స్‌ ఆశ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.



Tags:    

Similar News