ఆ విస్పోట‌న‌మే ఈ వీర‌సింహారెడ్డి!- బాల‌కృష్ణ‌

Update: 2023-01-06 16:50 GMT
ఒక స‌మ‌ర సింహారెడ్డి.. అఖండ.. లెజెండ్ ఎలా చ‌రిత్ర‌లో శాశ్వ‌తంగా నిలిచాయో అలా హిస్ట‌రీలో నిలిచే సినిమా వీర‌సింహారెడ్డి... అని అన్నారు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌. అన్నీ క‌లిసిన‌ప్పుడు విస్పోట‌నం జ‌రుగుతుంది. ఆ విస్పోట‌న‌మే ఈ వీర‌సింహారెడ్డి! అంటూ ఈ సంక్రాంతి రేస్ లో పందెం పుంజులా కాలు దువ్వారు. నేటి సాయంత్రం ఒంగోలులో జ‌రుగుతున్న ప్రీరిలీజ్ వేడుక‌లో న‌ట‌సింహం డ్యాషింగ్ స్టైల్లో అద్భుత స్పీచ్ తో అల‌రించారు.

తొలిగా త‌న తండ్రి న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు గారి న‌ట‌ప్ర‌తిభ గురించి ఆయ‌న వ‌ద్ద శిష్య‌రికం గురించి ప్ర‌స్థావించారు. అలాగే త‌న‌ త‌ల్లిదండ్రుల‌ను త‌ల‌చిన బాల‌కృష్ణ వారి ఆశీస్సుల‌తో న‌టుడిగా ఎదిగాన‌ని అన్నారు. ఇక న‌ట‌న గురించి ఆయ‌న త‌న వ్యూని అద్భుతంగా వివ‌రించారు. న‌ట‌న అంటే అర‌వ‌డ‌మో న‌వ్వ‌డ‌మో ఏడిపించ‌డ‌మో కాదు.. పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేయాలి. నేను ఆత్మ‌లోకి ప్ర‌వేశిస్తాను అని తెలిపారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ ఎంతో అద్భుత‌మైన సంగీతం అందించార‌ని బాల‌కృష్ణ తెలిపారు. బాక్సులు బ‌ద్ధ‌ల‌య్యే నేప‌థ్య‌ సంగీతం థియేట‌ర్ల‌లో వింటార‌ని కూడా అన్నారు.

థ‌మ‌న్ నా గ‌త చిత్రానికి సంగీతం అందించాడు. ఆ సంగీతానికి అమెరికాలో సౌండ్ బాక్సులు బ‌ద్ధ‌ల‌య్యాయి. తీసుకెళ్లి లోనేస్తామ‌న్నారు.. రేపు చూస్తారు.. మ‌ళ్లీ వీర‌సింహారెడ్డి థియేట‌ర్ల‌లో. ఈ సినిమాకి అంతటి అద్భుత‌మైన సంగీతం అందించాడు థ‌మ‌న్. ఈ చిత్రంలో బుర్రా సాయి మాధ‌వ్ డైలాగులు ఎంతో హైలైట్ గా నిలుస్తాయి.. అని అన్నారు.

న‌ట‌న‌లో విశ్వ‌రూపం.. వేష‌ధార‌ణ‌లో ద‌శావ‌తారం.. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ప్ర‌త్యేక‌తను చూపించిన విశ్వ‌న‌టుడికి సిస‌లైన‌ వార‌సురాలు అంటూ త‌న స‌ర‌స‌న న‌టించిన శ్రుతిహాస‌న్ ని బాల‌య్య బాబు ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. శ్రుతి స‌హ‌జ‌సిద్ధంగా న‌టించింద‌ని ప్ర‌శంసించారు. శ్రుతి అందంగా ఉంటుంది. .. క‌న్నుల విందుగా న‌టిస్తుంది.. స్వ‌యంకృషితో ఎదిగిన న‌టి అంటూ కితాబిచ్చారు. క‌మ‌ల్ డీఎన్ ఏ... ఎన్టీఆర్ డీఎన్ ఏ క‌లిసి ఈ సినిమాలో న‌టించాయ‌ని త‌న గురించి శ్రుతి గురించి బాల‌య్య అన్న మాటకు మాస్ లో చ‌ప్ప‌ట్లు మోతెక్కించాయి. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ సినిమాని రాజీ లేకుండా నిర్మించాని గోపిచంద్ మ‌లినేని ఒక ఒంగోలియ‌న్ అయినా మంగోలియ‌న్ లా శ్ర‌మించార‌ని కూడా త‌న‌దైన శైలిలో ఛ‌మ‌త్క‌రించారు.

గోపిచంద్ మ‌లినేని గురించి మాట్లాడుతూ.. న‌టీన‌టులు టెక్నీషియ‌న్ల నుంచి మంచి ఔట్ పుట్ తీసుకునే స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని. నా అభిమానిగా సినిమా తీసాడు. నాకు చాలా గ‌ర్వంగా ఉంది. ఒంగోలు గిత్త మ‌న గోపిచంద్ మ‌లినేని అని ప్ర‌శంసించారు.

అభిమానం కొంటే దొరికేది కాదు.. అది జ‌న్మ‌జ‌న్మ‌ల పుణ్యఫ‌లం. ఇన్ని వేల ల‌క్ష‌ల కోట్ల‌ అభిమానుల‌ను సంపాదించుకున్నానంటే అది నా గ‌త జ‌న్మ పుణ్య‌ఫ‌లం... అని బాల‌య్య బాబు ఎమోష‌న‌ల్ అయ్యారు. చివ‌రిగా ఈ సినిమాలో మ‌రో క‌థానాయిక‌గా న‌టించిన హ‌నీరోజ్ గురించి బాల‌య్య బాబు మాట్లాడారు. హనీరోజ్ పాత్ర ఈ సినిమాలో ఆస‌క్తిక‌రం. దానిని ర‌హ‌స్యంగా ఉంచాలి. కొన్ని చెప్ప‌కూడ‌నివి ఉంటాయి.. అని అన్నారు. ఓహ్! భ‌లే అమ్మాయిని ప‌ట్టారు! అనిపించింది. అణువ‌ణువునా ప్ర‌తి ఫ్రేమ్ లో అద్భుతంగా న‌టించింది. సినిమా చూశాక త‌న పాత్ర గురించి న‌ట‌న గురించి మీరే మాట్లాడుతారు.. అని ప్ర‌శంస‌లు కురిపించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News