బాలయ్య క్రేజు మామూలుగా లేదే!

Update: 2016-01-02 05:32 GMT
బాల‌య్య న‌టించిన డిక్టేట‌ర్ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ప్రముఖ చాన‌ల్స్ పోటీ ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నైజాం ఏరియా రైట్స్ దిల్ రాజు - సీడెడ్ ఏరియా రైట్స్  సాయి కొర్ర‌పాటి తీసుకోవ‌డంతో బిజినెస్ ప‌రంగా సినిమాకు చాలా క్రేజ్ వ‌చ్చింది. ఓవ‌ర్సీస్ లో కూడా ఈ సారి భారీగా విడుద‌ల‌య్యే  అవ‌కావాలున్నాయ‌ని తెలుస్తోంది.  ఇలా ఏరియా రైట్స్ సినిమా పై ఎంతో క్రేజ్ ని ఏర్ప‌ర‌చ‌డంతో శాటిలైట్ రైట్స్ కోసం చాన‌ల్స్ పోటీ ప‌డ్డాయ‌ట‌. చివ‌రికి 6 కోట్లు ఆఫ‌ర్ చేసి ఓ  ప్ర‌ముఖ ఛానల్ రైట్స్ సొంతం  చేసుకున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే ట్రైల‌ర్స్ - పాట‌లు సినిమా ఎన్నో అంచనాలు రేకెత్తించాయి. ఇక ముగ్గురు క‌థానాయిక‌లు ఈ సినిమాలో న‌టించ‌డం, ఇది బాల‌య్య 99 వ  సినిమా కావ‌డంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సంక్రాంతి కానుక‌గా వ‌స్తోన్న డిక్టేట‌ర్ సూప‌ర్ హిట్ గ్యారంటీ అంటున్నారు నంద‌మూరి అభిమానులు. ఈ పండుగ‌కు విడుద‌ల‌వుతున్న చిత్రాల‌ను డిక్టేట‌ర్ శాసిస్తాడో?  లేక సైడ‌వుతాడో చూడాలంటే ఈ నెల 14 దాకా ఆగాల్సిందే మ‌రి.
Tags:    

Similar News