నటసింహా బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన డిక్టేటర్ ఈ సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. రేసులో ఠఫ్ కాంపిటీషన్ ఉంది. అందుకే ఇటీవలి కాలంలో ఎంతో అలెర్టుగా ప్రమోషన్ కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఈరోజు ఉదయమే డిక్టేటర్ భామ అంజలి పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తోంది. అందుకోసం మీడియా ముందుకు వస్తోంది. ఈలోగానే మరో హాట్ న్యూస్ తెలిసింది.
డిక్టేటర్ ప్రమోషన్ ని కాస్తంత డిఫరెంట్ గా చేయాలని భావించారో ఏమో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే తెలంగాణ టీడీపీ కీలకనేత రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఓ స్పెషల్ షో వేసేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య బాబు. ఈ షోకి టీడీపీ నుంచి కీలకమైన నాయకులంతా హాజరవుతారని తెలుస్తోంది. సినిమా థియేటర్ ని పసుపు సైన్యంతో నింపేయాలి అనుకోవడం వెనక ప్రమోషన్ యాక్టివిటీ కూడా ఉందని అర్థమవుతోంది. ఎలానూ హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్యబాబుకు అభిమానుల్లో విపరీతమైన క్రేజు ఉంది. తెదేపా పార్టీ కార్యకర్తలంతా ఈ మూవీ చూసినా బోలెడంత సక్సెస్ వచ్చినట్టే.
అలాగే భవిష్యత్లో సీడెడ్ మార్కెట్ అంతా కేవలం బాలయ్య చేతిలోనే ఉండాలన్నది ఓ వ్యూహం. ఆ ప్రకారమే ఇప్పట్నుంచి ప్రణాళికలు అదిరిపోతున్నాయ్. ఏదేమైనా బాలయ్య డిక్టేటర్ బ్లాక్ బస్టర్ కొట్టి తన మార్కెట్ ని సుస్థిరం చేయాల్సిన సందర్భమిది. 100వ సినిమా ముంగిట ఇది బంపర్ హిట్ కొట్టాల్సిన టైమ్.