నందమూరి బాలకృష్ణ నటించిన "ఎన్టీఆర్ కథానాయకుడు" సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను అలరిస్తున్న ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ఈ ఇంటర్వ్యూ లో బాలకృష్ణ తన హరికృష్ణ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసాడు.
బాలయ్య మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుండి కూడా నాన్న గారి వద్ద గట్టిగా మాట్లాడలేకపోయేవాడిని. అంతా కూడా నాన్న గారితో మాట్లాడేందుకు భయపడేవారు. కానీ అన్నయ్య మాత్రం నాన్న గారితో ధైర్యంగా మాట్లాడేవారు. ప్రతి విషయంలో కూడా నాన్న గారికి చేదోడు వాదోడుగా ఉండేవారు.
అన్నయ్య చిన్నప్పటి నుండి కూడా తాతయ్య దగ్గర పెరిగిన కారణంగా నాన్న గారితో ధైర్యంగా మాట్లాడేవాడు. అన్నయ్య చిన్నప్పటి నుండి కూడా రెబల్ అంటూ బాలయ్య సరదాగా కామెంట్ చేసాడు. తాజాగా ఎన్టీఆర్ సినిమాలో హరికృష్ణ పాత్రను ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ పోషించిన విషయం తెలిసిందే. సినిమాలో కళ్యాణ్ రామ్ తన తండ్రి పాత్రలో ఆకట్టుకున్నాడు. సినిమాలో చూపినట్లుగా హరికృష్ణ నిజ జీవితంలో కూడా రెబర్ అంటూ బాలయ్య పేర్కొన్నాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక హరికృష్ణ పాత్ర మరి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ఎక్కువ ఉంటుందన్నమాట.