నందమూరి బాలకృష్ణ నేడు 60వ వసంతంలోకి ప్రవేశించారు. ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అభిమానులు భావించినా ప్రస్తుతం నెలకొనియున్న పరిస్థితుల వలన కుదరలేదు. బాలకృష్ణ సైతం తనను కలవడానికి ఎవరూ రావద్దని ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆయన తన 60వ పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకున్నారు. గడిచిన కొన్నేళ్లుగా తన బర్త్ డే నాడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్లి కేక్ కట్ చేసి వేడుక జరుపుకోవడం బాలకృష్ణకు ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈ ఏడాది కూడా ఆయన బసవతారకం హాస్పిటల్ లో తన పుట్టినరోజును జరుపుకున్నారు. సంప్రదాయ పట్టు వస్త్రాల్లో హాస్పిటల్ కు వెళ్లిన బాలయ్య ముందుగా తన తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు, బసవతారకం విగ్రహాలకు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్న పిల్లల సమక్షంలో బాలయ్య కేక్ కట్ చేసి.. ఆ పిల్లలుకు ఆప్యాయంగా కేక్ తినిపించారు.
అంతేకాకుండా బాలయ్య తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకను 'వింటేజ్ ఎన్.బీ.కే 1960' పేరుతో స్పెషల్ గా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ టీ షర్ట్స్ ధరించి సెలబ్రేట్ చేసారు. ఈ సందర్భంగా బాలయ్య వారి సమక్షంలో కేక్ కట్ చేసారు. ఈ వేడుకలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు - భువనేశ్వరీ దంపతులు, బాలయ్య సతీమణి వసుంధర, కొడుకు మోక్షజ్ఞ, అల్లుళ్ళు నారా లోకేష్, భరత్ మరియు కుమార్తెలు మనవళ్లు హాజరయ్యారు. చంద్రబాబు ఈ సందర్భంగా బాలయ్యకు బహుమతిని అందించారు. కాగా బాలయ్య పేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ ప్రతి ఏడాది కుటుంబ సభ్యులు మరియు అభిమానుల మధ్య ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకునే వాడిని. కానీ కరోనా కారణంగా ఇలా నిరాడంబరంగా జరుపుకున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నాడు.