ఇటీవలే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి గ్రాండ్ ఈవెంట్ పూర్తయింది. నటసింహా బాలయ్యబాబు నటించిన డిక్టేటర్ ఆడియో వేడుక ఘనంగా జరిగింది. లక్షలాది నందమూరి అభిమానుల సమక్షంలో ఈ వేడుక అదరహో అన్నట్టు సాగింది. తొలి ఈవెంట్ ఘనవిజయం సాధించింది. అయితే ఇదే ఈవెంట్ ఇంకొన్ని నగ్నసత్యాల్ని తెలుగు ప్రేక్షకులకు ఆవిష్కరించింది. ఆరోజు డిక్టేటర్ ఆడియో వేదిక మీద ఓ ఔత్సాహిక నందమూరి అభిమాని సీనియర్ ఎన్టీఆర్ ని ఇమ్మిటేట్ చేస్తూ రీమిక్స్ సాంగ్స్ లో డ్యాన్సులు చేశాడు. అది వీక్షకులకు కను విందు చేసింది. అయితే అది బాలయ్యబాబుకు మాత్రం ఏమాత్రం రుచించలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పుకోవడం విశేషం. పదండి ఎందుకో చూద్దాం.
సదరు ఎన్టీఆర్ గెటప్ వేసిన అభిమాని తన పెర్ఫామెన్స్ పూర్తయిన తర్వాత నేరుగా బాలయ్యబాబు వద్దకి వచ్చాడు. తనతో ఓ స్నాప్ దిగాలని ఆరాటపడ్డాడు. బాలయ్యతో ఫోటో దిగేప్పుడు అనుకోకుండానే తన చేతిని బాలయ్య భుజంపై ఏదో సీనియర్ ఎన్టీఆర్ లా వేయాలని ప్రయత్నించాడు. అంతే నటసింహం సూటిగా తన అసహనాన్ని వెల్లడించారని ప్రత్యక్ష సాక్ష్యులు ముచ్చటించుకున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. నందమూరి హీరో ఇలా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, సదరు ఫ్యాన్ కి వార్నింగ్ ఇవ్వడం అందరిలోనూ డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఇది టూ బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెబుతున్నారు. బాలయ్యను టచ్ చేసేముందు అతడి చుట్టూ ఉండే లైన్ ని అభిమాని అయినా దాటేయకూడదు.. అని చెబుతున్నారు.