ఇప్పుడు ''గౌతమీపుత్ర శాతకర్ణి'' టీజర్ తో బాలయ్య అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడైతే ఈ నందమూరి నటసింహం ఈ సినిమా ఒప్పుకున్నారో అప్పుడే ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డానికి డిసైడ్ అయ్యారు. మామూలుగా బయటనుండి చూస్తే.. రొటీన్ గానే ఉన్నారు కదా అనుకోవచ్చు.. కాని అసలు రోజూ అటువంటి కాస్ట్యూమ్స్ వేసుకుని దాదాపు 12 గంటలపాటు షూటింగులో పాల్గొనాలంటే మాత్రం చాలా స్టామినా ఉండాలి. అలాగే బాలయ్య వెయిట్ కూడా తగ్గాలి. ఇదంతా షూటింగ్ దగ్గరుండి చూసినవారికి తెలుస్తుంది.
సినిమా షూటింగ్ కు ముందే వెయిట్ తగ్గిపోయిన బాలయ్య.. షూటింగ్ టైములో రోజూ ఉదయాన్నే మూడున్నరకు లేచి... రెండు గంటలపాటు వ్యాయామం చేసేవారట. అలా చేసిన తరువాత మేకప్ అండ్ కాస్ట్యూమ్ తో సహా రెడీ 6.30 కు సెట్లో ఉండేవారట. ఆయన్ను చూసి మిగిలిన వారందరూ ఉరుకులు పరుగులు తీసేవారని తెలుస్తోంది. ఇప్పుడు ఏదైతే మనం ''రాయల్ లుక్'' అంటున్నామో.. దాని వెనుక ఆయన అవిరళ కృషి ఉందంటున్నాడు దర్శకుడు క్రిష్. ఆ కష్టం చెప్పలేనిది.. అది చూసినవారికే అర్ధమవుతుంది అని చెప్పాడు.
నిజమే కదా.. అసలు ఆయనకంటే యంగ్ హీరోలే అంత కష్టం మనకు ఎందుకులే అనుకుంటున్న టైములో.. ఆయన మాత్రం వయస్సును లెక్క చేయకుండా ఇప్పుడు శాతకర్ణి ఫీట్ చేయడం నిజంగానే ప్రశంసించదగిన విషయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/