‘ఎన్టీఆర్’ బయోపిక్ లో అత్యంత కీలకమైన ఏయన్నార్ పాత్రను ఆయన మనవడైన సుమంత్ వేసిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ మరియు ఏయన్నార్ ల కాంబినేషన్ లో వచ్చిన పలు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు వారి స్నేహం ఎప్పటికి మర్చి పోలేనిది. ఆ రెండు కుటుంబాల మద్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమకు వారిద్దరు రెండు పిల్లర్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వారి అన్యోన్యతను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
తాజాగా జరిగిన ఆడియో వేడుకలో సుమంత్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ... మామయ్యా అన్నాడు - మామయ్య ఏంట్రా అని నేను అన్నాను - నాకు మామయ్య అంటే నచ్చుదు - నా మనవడు నలుగురిలో తాతయ్య అన్నా కూడా నాకు నచ్చదు. ఇంట్లో అంటే పర్వాలేదు కాని నలుగురి ముందు అలా పిలవడం ఇష్టం ఉండదు. అయినా కూడా మామయ్య ఎన్టీఆర్ గారి కంటే ఏయన్నార్ గారు పొడుగు తక్కువ ఉండేవారు. మరి సినిమాలోనేమో నువ్వు పొడువు తక్కువ ఉన్నావు - నేను పొడుకు ఎక్కువ ఉన్నాను. ఎన్టీఆర్ కంటే ఏయన్నార్ పొడుగు ఎక్కువ అవుతున్నాడు కదా అన్నాడు.
అప్పుడు నేను ఈ సినిమాలో నిన్ను నన్ను ఎవరు చూడరు. అందరు కూడా ఎన్టీఆర్ - ఏయన్నార్ లను మాత్రమే చూస్తారు. ఒక సీన్ అద్బుతంగా వచ్చినప్పుడు ఆ సీన్ లో నటీనటులు కనిపించరు. కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయని బాలయ్య చెప్పుకొచ్చాడు. సుమంత్ తో చాలా చక్కని సీన్స్ చేశానని - మంచి నటనతో సుమంత్ ఆకట్టుకున్నాడని మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అన్ని కూడా బాగా వచ్చాయని బాలయ్య పేర్కొన్నాడు.