బాహుబలి.. ఓ రెండేళ్లుగా టాలీవుడ్ లో ఈ పదం ఓ మేనియా. బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ కి ముందు తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైన ఈ హంగామా.. ఇప్పుడే ఇతర భాషల్లోకి వ్యాపించేసింది. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం.. బాహుబలి సాధించిన రికార్డులను బాహుబలి మాత్రమే బ్రేక్ చేయగలడు. లేదా రాజమౌళి మాత్రమే దాటగలడు. కానీ దసరా రోజున ఇవన్నీ ఊహలే అనే విషయం ప్రూవ్ అయిపోయింది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్ ను విజయదశమి సందర్భంగా విడుదల చేశాడు దర్శకుడు క్రిష్. క్రీ.శ.2 శతాబ్దం చివరి కాలంనాటికి చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణిని చూపించిన తీరు.. యుద్ధంలో భయం అన్నదే ఎరుగని ధీరుడుగా బాలయ్య కనిపించిన విధానం.. 1800 ఏళ్ల క్రితం నాటి ఆ కాలం విజువల్స్ ను చూపించిన పద్ధతి చూసి అందరూ మెస్మరైజ్ అయిపోయారు. కరెక్టుగా ప్లాన్ చేస్తే.. అనుకున్నదాన్ని విజులవలైజేషన్ లో చూపించగలగితే.. ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగితే.. బాహుబలిని అందుకోవడం మరీ అందుకోలేని విషయమేమీ కాదనే విషయం గౌతమి పుత్ర శాతకర్ణి టీజర్ తో అర్ధమైపోతోంది.
క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం బాహుబలిని బీట్ చేసేయలేకపోయినా.. దానికి- దాని రికార్డులకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా.. బాలయ్య మూవీకే ఎక్కువ క్రెడిట్స్ దక్కుతాయి. ఎందుకంటే బాహుబలిని 3-4 ఏళ్ల పాటు కష్టపడి.. వందల కోట్లు పోసి తీస్తే.. గౌతమిపుత్ర శాతకర్ణిని 50 కోట్లతో ఆరు-ఏడు నెలల గడువుతో తీసేస్తున్నారు మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/