బాల‌య్య‌కి హ్యాండ్ ఇచ్చిన హీరోలు వీళ్లే!

Update: 2022-02-19 00:30 GMT
ఓటీటీ ప్లాట్ ఫాం `ఆహా`లో  న‌ట‌సింహ బాల‌కృష్ణ  చేసిన `అన్  స్టాప‌బుల్` ప్రోగ్రామ్ ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. `అన్ స్టాప‌బుల్` పై బాలయ్య త‌న‌దైన మార్క్ వేసారు.  `అన్ స్టాప‌బుల్` తో  ఓ కొత్త బాల‌య్య‌ని ప‌రిచ‌యం చేసారు.  హోస్టింగ్ పై త‌న‌దైన నైపుణ్యం..చలాకీత‌నం..త‌న మార్క్ పంచ్ ల‌తో బాల‌య్య ఆక‌ట్టుకోవ‌డం  `అన్ స్టాప‌బుల్`  స‌క్సెస్ లో కీల‌కంగా మారింది.

దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్ల్ అంద‌రిని ఈ వేదిక పై బాల‌య్య  క‌వ‌ర్ చేసారు. అలా  దిగ్విజ‌యంగా `అన్ స్టాప‌బుల్`  మొద‌టి సీజ‌న్ పూర్త‌యింది. అయితే ఈ ప్రోగ్రామ్ మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎప్పుడొస్తారు? అని అభిమానులు ఒక‌టే ఉత్కంఠ‌గా ఎదురుచూసారు. కానీ వాళ్లంద‌రికీ నిరాశ త‌ప్ప‌లేదు. వాస్త‌వానికి షో ప్రారంభంలోనే తార‌క్ అతిధిగా వ‌స్తార‌ని ప్ర‌చారం సాగింది.

ఎంతో మంది తార‌లు వ‌స్తున్నారు..చిట్ చాట్ లో పాల్గొంటున్నారు గానీ తార‌క్ జాడ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ హాజ‌రు కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల్ని `అన్ స్టాప‌బుల్` కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బీవీఎస్ ఎన్ ర‌వి తాజాగా  వెల్ల‌డించారు.  

రాజ‌మౌళి..కీర‌వాణిల‌తో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేసాం. దానికి ఎన్టీఆర్..రామ్ చ‌ర‌ణ్ కూడా హాజ‌రు కావాల్సి ఉంది. కానీ వారంతా ముంబై లో `ఆర్ ఆర్ ఆర్` ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల రాలేక‌పోయారు. రాజ‌మౌళి చాలా ప్ర‌య‌త్నించారు. కానీ కుద‌ర్లేదు`` తెలిపారు.

అలాగే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్..రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజుల‌తో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేసాం. వారంతా `రాధేశ్యామ్` ప్ర‌మోష‌న్ లో బిజీ అయ్యారు. ఆ కార‌ణంగానే వారు రాలేక‌పోయారు. ఆ త‌ర్వాత మా ప్ర‌య‌త్నాలు విర‌మించుకున్నామ‌ని`` ర‌వి తెలిపారు.

`అన్ స్టాప‌బుల్ సీజ‌న్ -2`కి రంగం సిద్దం అవుతుంది. ఈ సీజ‌న్ లో మిస్సైన  సెల‌బ్రిటీలు అంద‌ర్ని తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. అయితే ఈ సీజ‌న్ కి హోస్ట్  బాధ్య‌త‌లు ఎవ‌రు?  తీసుకుంటారు అన్న‌ది క్లారిటీ లేదు. బాల‌య్య అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నార‌ని.. ఆ కార‌ణంగా మ‌రో హీరోని తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఎవ‌రొచ్చినా బాల‌య్య తెచ్చినంత ఊపు తేగ‌ల‌రా? అన్న‌ది మ‌రో సందేహం. బాల‌య్య‌నే యధావిధిగా  కొన‌సాగితే `అన్ స్టాప‌బుల్`  కిక్కే వేర‌ప్ప‌.
Tags:    

Similar News