బాలయ్యే స్వయంగా రంగంలోకి దిగాడా...?

Update: 2020-08-02 16:30 GMT
నందమూరి తారకరామారావు నట వారసుడిగా బాలకృష్ణ తండ్రి పేరు నిలబెడుతూ ఇండస్ట్రీలో తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత జెనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ తన తాత పోలికలు పుణికి పుచ్చుకుని.. 16వ ఏట ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అదే కోవలో 22 ఏట అడుగుపెట్టిన నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నటసింహా వారసుడి తెరంగేట్రం గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ముందుగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఇంట్రడ్యూస్ అవుతారని.. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అని ప్రచారం జరిగింది. అయితే ఇటీవల బాలయ్య బర్త్ డే నాడు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. పూరీ లేదు.. ఇడ్లీ సాంబార్ లేదు అంటూనే మోక్ష‌జ్ఞ ఎంట్రీకి భారీగా ప్లాన్స్ వేసుంచానని.. అద్భుతమైన స్క్రిప్ట్స్ కూడా తీసి పెట్టానని.. అన్ని కుదిరినప్పుడు లాంచ్ ఉంటుందని.. ఇంకా రెండేళ్ల సమయం పెట్టొచ్చని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా బాలయ్య చెప్పిన స్క్రిప్ట్స్ లో ఒకటి స్వయంగా తనే రాస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొంత మంది ప్రముఖ రచయితలతో కలిసి బాలకృష్ణ స్వయంగా ఈ కథను డెవలప్ చేస్తున్నారట. అయితే ఇది 'ఆదిత్య 369'కు సీక్వెల్‌ గా రానున్న 'ఆదిత్య 999 మ్యాక్స్' సినిమా కోసమా అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేసి పలు కథలు చెప్పారని.. అవి నచ్చకపోవడంతో తనే స్వయంగా ఓ ఐడియా చెప్పానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు బాలకృష్ణ ఈ సీక్వెల్ తోనే మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని కూడా అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఇంకా సమయం ఉండటంతో ట్రైనర్ పర్యవేక్షణలో మోక్షజ్ఞ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.




Tags:    

Similar News