ఆ హెలికాప్టర్లో అల్లరే అల్లరి

Update: 2017-08-18 03:34 GMT
గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి భారి హిట్ తో  వంద చిత్రాల్లో నటించిన ఘనతను సాధించారు నందమూరి బాలకృష్ణ. ఇక తన 101వ మూవీ తో ఎలాంటి పాత్రతో వస్తాడు అనుకున్న అభిమానులకు మొదటి సారి ఒక  డిఫరెంట్ లుక్ తో  తన 101వ చిత్రంతో రాబోతున్నాడు. పురిజగన్నాథ్ తెరకెక్కించిన "పైసా వసూల్"  సినిమాతో సెప్టెంబర్ 1న అలరించనున్నాడు.

ఈ సందర్బంగా ఆడియో లాంచ్ ని తెలంగాణ రాష్ట్రంలో ని ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అయితే చిత్ర యూనిట్ సభ్యులు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి స్పెషల్ హెలికాప్టర్ లో ఖమ్మం వేదికను చేరుకున్నారు. ఈ క్రమంలో బాలయ్య నలుగురు హీరోయిన్ లో తో అల్లరి చేస్తూ  దిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. బాలయ్య తో శ్రీయ - కైరా దత్ మరియు ఛార్మి అలాగే ముస్కన్ సేతి కూడా తెగ అల్లరి చేసు ఆడియో వేడుకకి చేరుకున్నారు. అలాగే వారితో పాటు కమెడియన్ అలీ కూడా కనిపించి నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీరు చేసిన అల్లరి వీడియో సోషల్ మీడియాలో కూడా తెగ అల్లరి చేస్తోంది. ఇక వారు సాయంత్రం 5 గంటలకు ఖమ్మం కి చేరుకొని అట్టహాసంగా వేడుకను మొదలు పెట్టారు. ఈ ఆడియో లాంచ్ కి దర్శకులు బోయపాటి శ్రీను మరియు గౌతమి పుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఇదే విషయం గురించి పూరి జగన్ ప్రస్తావిస్తూ.. తాము హైదరాబాద్ నుండి ఖమ్మం రావడానికి హెలికాప్టర్ ఏర్పాటు చేసిన భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ ను తెగపొగిడేశారు. ఇంతకీ ఓ కారణం తెలుసా? అసలు ఈ ప్రొడ్యూసర్ ది నేటివ్ ప్లేస్ ఖమ్మం కాబట్టి.. ఈ ఫంక్షన్ ను అక్కడ పెట్టారట. అది సంగతి. 

Full View
Tags:    

Similar News