గ్రీకు సైనికులతో పోరాడనున్న బాలయ్య

Update: 2016-07-02 09:37 GMT
బాలకృష్ణ వందో సినిమాగా రూపొందుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి.. చాలా స్పీడ్ చూపిస్తున్నాడు. క్రిష్ ఈ సినిమాని తీస్తున్న విధానానికి స్పీడ్ అన్న మాట చాలా చిన్నది. అంత వేగంగా పిక్చరైజ్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. 17 శతాబ్దాలకు పూర్వం కథని తీస్తూ.. సంక్రాతికి విడుదల చేయడం సాధ్యమా అనే ప్రశ్నలకు ఇప్పుడు ఆన్సర్ దొరికేస్తోంది.

'జూలై 4 నుంచి  గౌతమిపుత్ర శాతకర్ణికి మూడో షెడ్యూల్ మొదలవుతోంది. జార్జియాలో చిత్రీకరించనున్న ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ ను తెరకెక్కించనున్నాడు. ఈ షెడ్యూల్ శాతవాహన సైనికులకు..  గ్రీకు సైనికులకు మధ్య పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నాం. రష్యాకు దగ్గరలో మౌంట్ కజ్ బెగ్ పర్వతం వద్ద తీయనున్నాం. 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో భారీ క్లైమాక్స్ చిత్రీకరణ జరగనుంది. బాలకృష్ణ త్వరలో షూటింగ్ కు రానున్నార' అంటూ నిర్మాతలు ప్రెస్ నోట్ కూడా ఇచ్చేశారు. అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్ జరపనున్నారన్న మాట.

ఇప్పటికే మొరాకోలో తీసిన ఫైటింగ్ ఎపిసోడ్.. ఇంటర్వెల్ సందర్భంగా వచ్చే యుద్ధం అని తెలుస్తోంది. ఇక హైద్రాబాద్ లో భారీనౌక సెట్ వేసి తీసిన సన్నివేశాలు.. సినిమాకు ఓపెనింగ్ సీక్వెన్స్ గా రానున్నాయి. అంటే ఓపెనింగ్.. ఇంటర్వెల్.. క్లైమాక్స్ షూటింగ్ లు పూర్తయిపోతాయన్న మాట. ఇక మిగిలింది రాజ కోటకు సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రమే. త్వరలో అది కూడా పూర్తి చేసేసి.. గ్రాఫిక్ వర్క్ కి వెళ్లనునంది యూనిట్. అసలు వీఎఫ్ఎక్స్ కోసమే.. ఈ సన్నివేశాలను ముందే తీసేస్తున్నారు. ఈ లెక్కన సంక్రాంతికి రిలీజ్ కావడం.. శాతకర్ణికి పెద్ద కష్టమేం కాదు.
Tags:    

Similar News