బాల‌య్యకి అమితాబ్ ఏం చెప్పాడో కానీ...!

Update: 2016-11-04 03:12 GMT
కొన్ని రోజుల కింద‌టే ద‌ర్శ‌కుడు  కృష్ణ‌వంశీని వెంట‌బెట్టుకొని వెళ్లి అమితాబ్ బ‌చ్చ‌న్‌ ని  స‌ర్కార్ 3 సెట్లో క‌లిశాడు బాల‌కృష్ణ‌. ఆ మీటింగ్ అంద‌రినీ ఆస‌క్తికి గురిచేసింది. ఎందుకు క‌లిశారంట‌? అంటూ వెంట‌నే ఆరాలు మొద‌ల‌య్యాయి.  బాల‌య్య న‌టించ‌నున్న 101వ చిత్రం కోస‌మే అమితాబ్‌ ని క‌లిసొచ్చార‌నే విష‌యం ఆ త‌ర్వాత బ‌య‌టికొచ్చింది. మ‌రి బాల‌కృష్ణ కోరిక‌ని అమితాబ్ మ‌న్నించి సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకొన్నాడా లేదా అనే విష‌యం మాత్రం ఇప్ప‌టిదాకా బ‌య‌టికి రాలేదు. ఆ విష‌యం గురించి అటు బాల‌కృష్ణ‌గానీ - ఇటు కృష్ణ‌వంశీగానీ ఇప్ప‌టిదాకా స్పందించ‌నేలేదు.

అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించేందుకు ఒప్పుకొన్నాడ‌ని, తెర‌పై ఆయ‌న రాష్ట్రప‌తి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని చెబుతున్నాయి. నిజంగా బాల‌కృష్ణ‌కి అమితాబ్ ఏం చెప్పాడో ఏంటో  ఎవ్వ‌రికీ తెలియ‌దు కానీ... అమితాబ్ పోషిస్తాడ‌ని ప్ర‌చారంలో ఉన్న రాష్ట్రప‌తి పాత్ర విష‌యంలో మాత్రం ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీకి బాల‌కృష్ణ ప‌లు సూచ‌న‌లు చేశాడ‌ట‌. త‌న‌కి చెప్పినదానికంటే బ‌లంగా ఆ పాత్ర ఉండాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశాడ‌ట‌. దాంతో ఇప్పుడు కృష్ణ‌వంశీ ఆ పాత్ర‌పై మ‌ళ్లీ త‌న బృందంతో క‌లిసి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. అడ‌గ్గానే బిగ్ బీ ఒప్పుకున్నాడు కాబ‌ట్టి పాత్ర విష‌యంలో, ప్రాధాన్యం విష‌యంలో ఏమాత్రం లోటుపాట్లు ఉండ‌కూద‌ని, ఆ పాత్ర తెర‌పై ఎంతో హుందాగా ఉండాల‌నేది బాల‌కృష్ణ ఆలోచ‌న‌ట‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇప్పుడు క‌థ‌లో మార్పులు చేర్పులు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News