నందమూరి బాలకృష్ణ.. దర్శకుడు గుణశేఖర్ ల మధ్య విబేధాలొచ్చాయా? ఇప్పుడిదో హాట్ టాపిక్ అయిపోయింది. ఇందుకు కారణం.. రీసెంట్ గా జరిగిన టీఎస్సార్ అవార్డుల ఫంక్షన్ లో జరిగిన సంఘటనే. ఈ ఫంక్షన్ లో జరిగిన ఉదంతంపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
టీఎస్సార్ అవార్డుల వేడుకలో భాగంగా స్టేజ్ పై ఉండి బాలకృష్ణ అవార్డులు ఇస్తున్నారు. ఇంతలో ఓ గుణశేఖర్ కు పిలుపు వచ్చింది. ఆ దర్శకుడు కూడా స్టేజ్ పైకి వచ్చాడు. ఇలాంటి సందర్భంలో కౌగిలించుకోవడం.. కనీసం కరచాలనం చేసుకోవడం లాంటివి చూస్తుంటాం. కానీ అలాంటివేమీ జరగలేదు సరికదా.. ఎవరికి వారు తమకు పట్టనట్లుగా నుంచున్నారు. శాలువా కప్పినపుడు బాలయ్య.. కప్పించుకుంటూ గుణశేఖర్ ముభావంగానే ఉండిపోయారు. అసలు కనీసం కలిసి ఒక సినిమా కూడా చేయకుండానే వీరి మధ్య విబేధాలకు కారణం.. గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల తర్వాత జరిగిన ఉదంతం.
శాతకర్ణిని చారిత్రక చిత్రంగా గుర్తించి పన్ను రాయితీ ప్రకటించడంతో.. తన రుద్రమదేవికి కూడా ఇవ్వాలంటూ పబ్లిక్ గానే డిమాండ్ చేశాడు గుణశేఖర్. ఆ వివాదం చిలికి చిలికి కోర్టు వరకూ చేరింది. అందుకే వీరిద్దరికి పడడం లేదని టాలీవుడ్ అనుకుంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/