ఆల్రెడీ మన టాలీవుడ్ అంతటా బాలయ్య 100వ సినిమా.. గౌతమిపుత్ర శాతకర్ణి తొలి రూపు తాలూకు ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ లో నెం.1 స్థానంలో ట్రెండ్ అవుతోంది సదరు ఫస్ట్ లుక్ పోస్టర్. దర్శకుడు క్రిష గతంలో లోగో లుక్ తో ఎలాగైతే అందరినీ ఆకట్టుకున్నాడో.. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే అందరినీ ఇంప్రెస్ చేశాడు. ఇక్కడే ఒక విషయం గురించి మనం చర్చించుకోవాలి.
మొరాకో దేశంలో షూటింగ్ కు వెళ్లిన సమయంలో.. అసలు బాలయ్య ఎన్నిసార్లు కెమెరాలకు చిక్కాడో మనకు తెలిసిందే. అయితే ప్రతీసారీ ఫ్యాంటూ షర్టులోనే కనపించాడు. ఆయన గెడ్డం లుక్ తప్పించి.. ఆయన తలకు పెట్టుకునే కిరీటం నుండి పొడుగాటి జుట్టు వరకు.. ఎలా ఉంటుంది అనే విషయం మాత్రం లీక్ కానివ్వకుండా చూసుకున్నారు ''గౌతమిపుత్ర శాతకర్ని'' టీమ్. ఈ రేంజులో లుక్ లీకవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది పెద్ద విషయమే మరి.
ఇకపోతే ఈ సినిమాలోని ఇతర క్యారక్టర్లను ఎవరు చేస్తున్నారనేది ఇంకా తెలియదు. శ్రీయ మాత్రం హీరోయిన్ రోల్ చేస్తోందని ఆల్రెడీ చెప్పేశారు. హేమా మాలిని కూడా రాజమాతగా కనిపిస్తుందని అన్నారు. వీరందరి లుక్ కూడా బయటకు వస్తే.. బాహుబలి.. రుద్రమదేవి.. సినిమాల తరువాత నయా జనరేషన్ లో వచ్చిన ఎపిక్ మూవీగా గౌతమిపుత్ర శాతకర్ణి వాటి సరసన చేరుతుంది మరి.