ఎన్టీఆర్ బయోపిక్ కు వాస్తు ప్రాబ్లమ్?

Update: 2018-05-05 08:11 GMT
ఇండియాలో చాలా వరకు ఎంత చదువుకున్న మేదావులైనా సరే సెంటిమెంట్స్ ఫాలో అవుతారని అందరికి తెలిసే ఉంటుంది. దైవభక్తి తో అనుసంధానమైన ప్రతి విషయంలో వాస్తు దోషం లేకుండా చూసుకోవడం భారతీయులకు అలవాటే. ఇక సినిమా వాళ్ల గురించి అయితే స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కరెక్ట్ సమయనికి అనుకున్న వర్క్ పూర్తి చేస్తారో లేదో తెలియదు కాని ముహూర్త సమయానికి మాత్రం షూటింగ్ లను స్టార్ట్ చేస్తారు.

టాలీవుడ్ లో ఆ డోస్ కాస్త ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అయితే వాస్తు ప్రకారం ప్రతి విషయాన్ని ఫాలో అవుతుంటారు. హీరోల్లో దైవభక్తి ఆయనకు ఉన్నట్టుగా ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది. ముఖ్యమైన విషయాలలో దైవ ఘడియాలను తెలుసుకొని ఆ సమయానికి పనులు మొదలు పెడతారు. వాస్తు దోషాలు గురించి ఆయన శ్రద్దలు చాలానే తీసుకుంటారు. ఆయన దగ్గర అందుకోసం స్పెషల్ పండితులు కూడా ఉన్నారు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. గత కొంత కాలంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతుండడం బాలయ్యకు ఏ మాత్రం నచ్చడం లేదు.

స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తుండడంతో కరణమెంటని ఆరా తీయగా ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ అని తెలుస్తోంది. అక్కడే సినిమా గురించి ప్రతి విషయం బయటకు వస్తుంది. ఏ ప్లాన్ వేసుకున్న చర్చించుకున్న ఆ ఆఫీస్ లోనే. ప్రశాసన్ నగర్ లో ఉన్న ఆ ఆఫీస్ కి వాస్తు లోపలున్నాయని బాలయ్య ఆస్థాన పండితులు చెప్పారట. ఆ ఆఫీస్ ఎన్నో అపజయాలను ఎదుర్కొన్న ఓ సీనియర్ నిర్మాతదట. దీంతో ఆ బ్యాడ్ లక్ ఎన్టీఆర్ బయోపిక్ ని కూడా ఫాలో అవుతుందని తెలిసి వెంటనే అక్కడి నుంచి బయట పడ్డారట. ప్రస్తుతం వేరే ఆఫీస్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News