బాలయ్య ఫోన్ చేస్తే చాల‌ట‌

Update: 2016-01-02 06:54 GMT
హీరోయిన్ ఒక సినిమాలో న‌టించేందుకు ఒప్పుకోవాలంటే దాని వెన‌క చాలా తతంగాలు న‌డ‌వాల్సి వుంటుంది. క‌థ న‌చ్చాలి, పారితోషికం న‌చ్చాలి, పాత్ర‌ని తీర్చిదిద్దే విధానం, వేసుకోవ‌ల్సిన డ్రెస్సులు వ‌గైరా... ఇలా చాలా కండిష‌న్లే ఉంటాయి. అన్నీ కుదిరిన‌ప్పుడే ఆ హీరోయిన్ సినిమాకి ప‌చ్చ‌జెండా ఊపుతుంటుంది. కానీ బాల‌య్య క‌థానాయిక‌లు అలా కాద‌ట‌. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇక మిగ‌తా ఏమీ అడ‌గ‌కుండా సినిమా ఒప్పేసుకొంటార‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా బాల‌కృష్ణే చెప్పుకొచ్చాడు. ``ఇద్ద‌రు ముగ్గురు క‌థానాయిక‌లు ఉంటారు. వాళ్ల‌కి నేనెంత చెబితే అంత‌. నా సినిమాలో న‌టించాల‌ని ఫోన్ కాల్‌ చేస్తే చాలు. మిగ‌తా విష‌యాలేవీ అడ‌గ‌కుండా ఓకే చెప్పేస్తారు. అందులో సోనాల్ చౌహాన్ కూడా ఒక‌రు`` అని సెల‌విచ్చాడు బాల‌కృష్ణ‌.
 
లెజెండ్ నుంచి సోనాల్ బాల‌కృష్ణ‌కి బాగా ద‌గ్గ‌రైంది. ఇటీవ‌ల డిక్టేట‌ర్‌ లోనూ ఆమె న‌టిస్తోంది. సినిమాకి సంబంధించిన వేడుక‌ల్లోనూ బాల‌కృష్ణ ప‌క్క‌నే సోనాల్ చౌహాన్ కూర్చుంటుంది. దీన్నిబ‌ట్టి వీళ్ల మ‌ధ్య బాండింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.  సోనాల్ మంచి ప్రొఫెష‌న‌ల్ హీరోయిన్ అని  ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూ లో కితాబునిచ్చాడు బాల‌య్య‌. అంత‌టితో ఆగ‌లేదు. తెలుగమ్మాయి అంజ‌లిని కూడా ఆకాశానికెత్తేశాడు. అంజ‌లిలాంటి ఒక తెలుగమ్మాయి క‌థానాయిక కావ‌డం చాలా హ్యాపీగా ఉంద‌ని, అయితే త‌నొట్టి వాగుడు కాయ అని చెప్పుకొచ్చాడు బాల‌య్య‌. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండే అంజ‌లినీ, అల్ల‌రి చేసే న‌న్ను భ‌రించాల్సి వుంటుంద‌ని డిక్టేట‌ర్ శ్రీవాస్‌ కి ముందే చెప్పాన‌ని న‌వ్వేశాడు బాల‌య్య‌.
Tags:    

Similar News