బాలయ్య సినిమాపై బోలెడన్ని ఆశలు

Update: 2016-10-30 17:30 GMT
2017 సంక్రాంతి రేస్ ఇప్పటికే వేడివేడిగా ఉంది. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150.. బాలకృష్ణ ల్యాండ్ మార్క్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి ఒక రోజు గ్యాప్ లో థియేటర్లలోకి రానుండడంతో.. రిజల్ట్ కంటే ముందు రిలీజ్ కోసమే పోటీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

మెగాస్టార్ నటిస్తున్న ఖైదీ నెంబర్ 150పై అంచనాలు ఎక్కువగానే ఉండడం.. అంతకంతకూ ఈ మూవీ రేంజ్ పెరిగిపోతుండడంతో.. డిస్ట్రిబ్యూటర్లు ఎంత రేట్ అయినా ఇచ్చేందుకు సిద్ధమయిపోతున్నారు. మరోవైపు బాలకృష్ణ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణికి  బజ్ మాత్రం ఇదే రేంజ్ లో ఉంది. ఇప్పుడు బాలయ్య సినిమాపై డిస్ట్రిబ్యూటర్లలో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి పన్ను రాయితీ వచ్చేస్తుందనే టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. శాతకర్ణి చారిత్రాత్మక చిత్రం కావడంతో.. రుద్రమదేవికి మాదిరిగానే పన్ను రాయితీలు వస్తాయని చాలామంది బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు.

ఏపీలో బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీనే అధికారంలో ఉండడం.. శాతకర్ణి స్టార్టింగ్ కి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అటెండ్ కావడం గుర్తు చేసుకుని.. రెండు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపులు గ్యారంటీ అని.. గౌతమిపుత్ర శాతకర్ణిని ఎగ్జిబిట్ చేస్తే.. ఎక్కువ లాభాలు పొందచ్చన్ని అనుకుంటున్నారట. అయితే.. ఈ వాదనను కొందరు కొట్టి పడేస్తున్నారు. థియేటర్లకు జనాలను రప్పించే సత్తా ఏ సినిమాకి ఉంటే.. ఆ సినిమానే ప్రదర్శించడానికి ఇష్టపడతారని.. పన్ను రాయితీల్లాంటి ఆఫర్లు సినిమా ప్రదర్శనల్లో అంతగా వర్కవుట్ కావన్నది నిపుణుల ఉవాచ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News