బాలయ్య బోయపాటిల ట్రిపుల్ రిస్క్!

Update: 2018-12-25 05:46 GMT
హీరోలు ద్విపాత్రాభినయం చేయడం కామనే కాని మూడు రోల్స్ లో కనిపించడం అరుదుగా జరుగుతుంది. అయితే ఇలాంటి కథలతో చాలా రిస్క్ ఉంటుంది. అభిమానులను సంతృప్తి పరచడం అంత సులభంగా ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశ కమర్షియల్ గా సేఫ్ అయినా చేరుకోవాల్సిన రేంజ్ కు అది వెళ్ళలేదన్నది వాస్తవం. గతంలో చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళుతో ట్రై చేస్తే అది ఫ్లోప్ అయ్యింది. అయితే ఇప్పుడీ టాపిక్ ఎందుకు వచ్చిందంటారా. ఎన్టీఆర్ తర్వాత బాలయ్య బోయపాటి శీనుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఎన్టీఆర్ ఆడియో రిలీజ్ లో వేదిక మీద బోయపాటి అధికారికంగా ప్రకటించాడు.

అయితే తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో బాలయ్య ట్రిపుల్ యాక్షన్ చేయబోతున్నట్టు టాక్. అయితే ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. మూడు పాత్రలు కథలో సమాంతరంగా ఉంటాయట. అంటే తాత నాన్న కొడుకు తరహాలో అన్న మాట.బాలకృష్ణ ఈ ఫీట్ చేయడం మొదటిసారి కాదు. గతంలో పరుచూరి మురళి దర్శకత్వంలో అధినాయకుడులో చేసాడు. డిజాస్టర్ అయ్యింది. అప్పుడెప్పుడో ఒకే సినిమాలో మూడు పాత్రలు ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి.

కాని బాలయ్య ఈ నెగటివ్ సెంటిమెంట్ ని అసలు పట్టించుకోవడం లేదట. కారణం బోయపాటి మీదున్న నమ్మకం. సక్సెస్ లేని టైంలోనే బోయపాటి బాలయ్యతో సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. సో ముగ్గురు బాలయ్యలను ఎలా డీల్ చేయాలో అతనికి తెలిసినంత ఇంకెవరికి తెలియదని సో ధైర్యంగా ఉండొచ్చని చెప్పినట్టు టాక్. మొత్తానికి వంద దాటాక బాలయ్య స్పీడ్ చాలా జోరు మీదుంది. గ్యాప్ లేకుండా ఏడాదికి కనీసం రెండు సినిమాలు వచ్చేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు
Tags:    

Similar News