చిరంజీవి ఇంట్లో జరిగిన 80స్ క్లబ్ రీ యూనియన్ కి నన్నెందుకు పిలవలేదు : బాలయ్య
సినీ ఇండస్ట్రీలో నందమూరి - మెగా ఫ్యామిలీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుందని ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట. అయితే అది నిజం కాదని ఇండస్ట్రీలో అందరం కలిసిమెలిసి ఉంటామని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇరువురు ఫ్యామిలీస్ కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు. ఒకరి ఫంక్షన్స్ కి ఒకరు హాజరవుతూ అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు. గతంలో చిరంజీవి పెద్ద కుమార్తె వివాహ సమయంలో బాలకృష్ణ హాజరై డ్యాన్స్ లతో సందడి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చిరంజీవి షష్టి పూర్తి వేడుకలు బాలయ్య కూడా హాజరై వారితో కలిసి ఎంజాయ్ చేసారు. అయితే ఈ మధ్య ఎందుకో వారు మళ్ళీ దూరంగా ఉంటూ వస్తున్నారు అనే టాక్ వినిపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల బాలకృష్ణ.. ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసుకుని తనని పిలవలేదని అసహనానికి గురైన సంగతి తెలిసిందే. ''నన్నెవరూ పిలవలేదు.. ఒక్కడు కూడా పిలవలేదు. ఇండస్ట్రీలో భూములు పంచుకుంటున్నారా..'' వ్యాఖ్యలు చేసారు.
బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ స్పందించి ఆయన పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత నాగబాబు కామెంట్స్ పై స్పందించిన బాలయ్య.. ''ఛీ ఛీ నేను మాట్లాడటమేంటి.. ఆయనే మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడను'' అంటూ లైట్ తీసుకున్నాడు. ఈ క్రమంలో నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ''ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదం టీ కప్పులో తుఫాను లాంటిది.. బాలయ్య కావాలని అలా మాట్లాడాడని నేను అనుకోవడం లేదు. బాలయ్యతో ఇండస్ట్రీ ప్రముఖులు మాట్లాడారు.. ఆ ఇష్యూ ఆంతటితో అయిపోయింది'' అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశానికి ఇండస్ట్రీ పెద్దలు బాలయ్యను ఇన్వైట్ చేయగా బర్త్ డే ఉండటం వలన రాలేనని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో నందమూరి - మెగా వివాదం ముగిసింది అనుకున్నారు. అయితే బాలయ్య 'నన్ను పిలవలేదు' అని వ్యాఖ్యానించడానికి కారణం చిరంజీవి ఇంట్లో మీటింగ్ ఒక్కటే కారణం కాదని తెలుస్తోంది. ఆయన మనసులో ఎప్పటి నుండో చిరంజీవి తనని పిలవడం లేదని ఉందని ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపడింది.
కాగా ప్రతి ఏడాది 80స్ క్లబ్ పేరుతో అప్పటి హీరో హీరోయిన్స్ రీయూనియన్ అవుతూ ఉంటారు. ఎవరో ఒకరి ఇంట్లో మీట్ అవుతూ అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఒకరు హోస్ట్ చేస్తుండగా గతేడాది చిరంజీవి హైదరాబాద్ లోని తన నివాసంలో 10వ రీ యూనియన్ ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి అలనాటి నటీనటులు అందరూ హాజరయ్యి ఆటపాటలతో ఎంజాయ్ చేసారు. దీనికి సంభందించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. అయితే ఆ ఫోటోలలో నందమూరి బాలకృష్ణ మాత్రం కనపడలేదు. అయితే అప్పుడు బాలయ్య ఏదో షూటింగ్స్ తో బిజీగా ఉండి ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ కాలేదేమో అని అందరూ అనుకున్నారు. అయితే బాలయ్య 80స్ క్లబ్ రీయూనియన్ కి హాజరు కాకపోవడానికి కారణం అది కాదని బాలయ్య వ్యాఖ్యలతో బయటపడింది. లేటెస్టుగా బాలయ్య ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు యాంకర్ ''మీరు చిరు క్లోజ్ గా అన్యోన్యంగా ఉంటారు కదా.. ఆయన షష్టి పూర్తి వేడుకలకు హాజరై సందడి చేసారు. మరి అలాంటిది చిరంజీవి డైరెక్ట్ గా మీకు కాల్ చేసి ఇన్వైట్ చేసే పరిస్థితులు లేవా'' అని ప్రశ్నించారు. దీనికి బాలయ్య సమాధానం చెప్తూ.. '' ప్రతి ఏడాది ఓల్డ్ 80స్ బ్యాచ్ అందరం కలుస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ ఇక్కడే జరిగింది. దానికి నన్ను పిలవలేదుగా. ఎందుకు పిలవాలా...? ఆయన ఇంట్లోనే జరిగింది. నన్ను పిలవలేదు. సుమలత - అంబరీష్ గారు మైసూర్ లో ఏర్పాటు చేసినప్పుడు పిలిస్తే వెళ్ళాను.. మోహన్ లాల్ గారు హోస్ట్ చేసినప్పుడు వెళ్ళాను. కానీ హైదరాబాద్ లో ఏర్పాటు చేసినప్పుడు నన్నెందుకు పిలవలేదు..?'' అంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా బాలయ్య మాట్లాడుతూ ''ఐ డోంట్ కేర్.. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.. నన్ను పక్కన పెట్టాలనుకుంటే పూర్తిగా అవైడ్ చేసేయండి. నా దారిలో నేను వెళ్తా'' అంటూ ఘాటుగా సమాధానం చెప్పుకొచ్చారు. దీనిని బట్టి బాలయ్య అసహనం ఎప్పటి నుంచో ఉందని స్పష్టం అయింది. అయితే దీనిపై మెగా అభిమానులు మాత్రం వేరేలా స్పందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేపాక్షీ ఉత్సవాలు బాలయ్య ఆధ్వర్యంలో జరగగా దానికి టాలీవుడ్ మాజీ కేంద్ర మంత్రి.. స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవిని ఇన్వైట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవిని ఎందుకు పిలవలేదని ప్రశ్నించగా ఎవరిని పిలవాలో పిలవకూడదో తనకు తెలుసని.. పిలవాల్సిన వారందరిని పిలిచామని బాలయ్య సమాధానం ఇచ్చిన విషయం ఇప్పుడు మర్చిపోయాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి బాలయ్య లేటెస్టుగా చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.
వీడియో కోసం క్లిక్ చేయండి