నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెజారిటీ పార్ట్ షూట్ చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ ను కూడా జరుపుకుంటోంది. ఇక పెండింగ్ పార్ట్ ను పూర్తి చేసేందుకు షెడ్యూల్స్ ఖరారైపోగా.. సంక్రాంతి పండుగకు ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
గౌతమిపుత్ర శాతకర్ణితో ఈ చిత్ర నిర్మాతలు దాదాపు 70-80 కోట్లు బిజినెస్ చేసేస్తున్నారు. అయితే ఈ రేంజ్ బిజినెస్ చేసే సినిమాల్లో హీరోలకు కనీసం 15-20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం తెలిసిందే. కానీ బాలయ్య మాత్రం ఈ చిత్రానికి కేవలం 8 కోట్ల రెమ్యూనరేషన్ తో సరిపెట్టేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి 10 కోట్ల వరకూ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధపడ్డా.. సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించడం కోసం బాలయ్య మాత్రం.. 8 కోట్లు మాత్రమే పుచ్చుకున్నారట. సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించడం కోసం ఉపయోగించాలని కూడా చెప్పారట.
ఇలా ఓ హీరో పారితోషికం సినిమా ఖర్చులో 10శాతం ఉండడమంటే.. మిగిలిన స్టార్ హీరోలకు బెంచ్ మార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పుడు రూపొందుతున్న చాలా సినిమాలకు సగానికి పైగా బడ్జెట్.. ఆ హీరో-డెైరెక్టర్లకే సరిపోతోంది మరి. ఆ విధంగా బాలయ్య కేకలు పెట్టించారనమాట. మరి ఇతర హీరోలు కూడా ఇది ఫాలో అయితే బెటర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/