నాలుగు రోజుల కిందట ఆంధప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన నాటి నుంచి ఎంత గొడవ నడుస్తోందో తెలిసింది. ముఖ్యంగా 2014 సంవత్సరానికి ‘లెజెండ్’ సినిమాకు అవార్డులు వెల్లువెత్తడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీనిపై సినీ ప్రముఖుల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. అవి ఒక దశ దాటి బూతుల వరకు కూడా వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ అవార్డుల విషయమై ‘లెజెండ్’ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ స్పందించాడు. ఆయన ఈ వివాదంపై అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.
‘‘లెజెండ్ మాములు టైటిల్ కాదు. ‘లెజెండ్’ సినిమాపై అప్పట్లో ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. సమిష్టి కృషితోనే లెజెండ్ సినిమాకు 9 అవార్డులు వచ్చాయి. మాటలతో కాదు... చేతల్తో చూపించిన సినిమా లెజెండ్. నంది అవార్డులు అవార్డులు గెలుచుకున్న అందరికీ అభినందనలు. నంది అవార్డులు ప్రకటించినపుడల్లా వివాదాలు.. అసంతృప్తి జ్వాలలు మామూలే’’ అని బాలయ్య అన్నాడు. నంది అవార్డులు ప్రకటించినపుడల్లా వివాదాలు మామూలే అని బాలయ్య అన్నాడు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన రక్తదాన శిబిరానికి వచ్చినపుడు విలేకరులతో మాట్లాడుతూ బాలయ్య ఇలా స్పందించాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య కూతురు బ్రాహ్మణిని నంది అవార్డుల వివాదం గురించి అడిగితే.. దానిపై స్పందించడానికి ఇది సరైన సమయం కాదంది.
Full View