అనంతంపురం జిల్లాలోని లేపాక్షి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలను ప్రతేక శ్రద్ధ తీసుకొని జరిపించారు. సినిమాల్లో, రాజకీయాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న బాలయ్య ఈ ఉత్సవాల్లో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్' సినిమా సంక్రాంతికి విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'గణ గణ గణా.. గణా.. ఆంధ్ర తెలంగాణా' అనే పాట ఇప్పటికి అందరూ హం చేస్తూనే ఉన్నారు.
అయితే లేపాక్షి ఉత్సవాల్లో కూడా బాలయ్య ఈ పాట పాడాలని ముందే డిసైడ్ అయ్యాడనుకుంట. సింగర్ గీతామాధురి తో కలిసి ఆ పాట పాడడమే కాదు.. దానికి ఇద్దరు కలిసి స్టెప్పులు కూడా వేశారు. కొత్త ఉత్సాహంతో ఉన్న బాలయ్య తన పాటతో, డాన్సులతో ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. నిజానికి బాలయ్య పాట పాడడం ఇది కొత్తేమీ.. కాదు. 'హుదూద్' బాధితుల కోసం ఏర్పాటు చేసిన 'మేము సైతం' కార్యక్రమంలో కూడా పాట పాడి విరాళాలు సేకరించాడు.