చిరంజీవి బామ్మర్ధి అల్లు అరవింద్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్సే. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే. వీరి కాంబినేషన్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.
అయితే గత కొన్నాళ్లుగా వీరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో వీరి కాంబినేషన్లలో సినిమా వస్తుందని అంతా ఆశించారు. అయితే అలాంటిదేమీ ఇప్పటిదాకా జరుగలేదు. చిరంజీవి సినిమాలను ఆయన తనయుడు రాంచరణే దగ్గరుండి చూసుకున్నారు.
ఇలాంటి క్రమంలోనే మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయనే వార్తలు గుప్పుమన్నాయి. వీటిని అల్లు అరవింద్ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా రూమర్లు మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి సమయంలోనే అల్లు కుటుంబం గత కొద్దిరోజులుగా నందమూరి కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండటం చర్చకు దారితీసింది.
అల్లు అరవింద్ కు సంబంధించిన 'ఆహా' ఓటీటీలో బాలయ్య 'అన్ స్టాబుల్' షో చేస్తున్నారు. బుల్లితెరపై బాలయ్య హోస్టుగా చేస్తున్న తొలి షో ఇదే కావడం విశేషం. మొదటి సీజన్ ను విజయవంతం పూర్తి చేసుకున్న 'ఆహా' టీం ఇప్పుడు 'అన్ స్టాబుల్' సీజన్-2ను కొనసాగిస్తోంది. ఇటీవల ఈ షోకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం హాజరయ్యారు.
నందమూరి-నారాల మధ్య జరిగిన సంభాషణలు ఆ ఎపిసోడ్ కు హైప్ తీసుకొచ్చింది. 'ఆహా'లో అత్యధిక వ్యూస్ ఈ ఎపిసోడ్ కు వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఆ మధ్య 'అఖండ' సినిమా ప్రీ రిలీజు ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా 'జై బాలయ్య' అంటూ పొగడ్తలవర్షం కురిపించారు.
తాజాగా అల్లు శిరీష్ నటించిన 'ఊర్వసివో రాక్షసివో' సినిమా నవంబర్ 4న రిలీజు కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజు ఈవెంట్ ఈ వారంలో హైదరాబాద్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని టాక్ విన్పిస్తోంది. అల్లు అరవింద్ ఇప్పటికే ఈ విషయాన్ని బాలయ్యతో మాట్లాడగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
కొంతకాలంగా అల్లు కుటుంబం నందమూరితో చాలా సన్నిహితంగా ఉంటుండటంతో తెరవెనుక ఏదో జరుగుతుందనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఈ విషయంపై అభిమానులు సైతం రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలయ్య 'ఊర్వసివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడుతారన్నది మరింత ఆసక్తిని రేపుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.